పురుషులు వాడే మాత్రలు ఎక్కడా దొరకవు. దాదాపు ఏడెనిమిది దశాబ్దాలుగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నా ‘మేల్ బర్త్ కంట్రోల్ పిల్స్’ను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. కానీ, యువర్ ఛాయిస్ థెరప్యూటిక్స్ ఈ పరిశోధనలు జరిపి ‘వైసీటీ-529’ అనే ‘హార్మోన్ రహిత గర్భనిరోధక మాత్ర’ను అభివృద్ధి చేశామని.. ఎలుకలపై, సైనోమోల్గస్ జాతి కోతులపై చేసిన పరిశోధనల్లో అది 99ు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని తెలిపారు. వీర్యకణాల తయారీకి అత్యంత కీలకమైన విటమిన్ ఏను వృషణాలకు అందకుండా నిరోధిస్తుందని.. దానివల్ల వీర్యం ఉత్పత్తి ఆగిపోతుందని అంటున్నారు. అదే సమయంలో ఈ మాత్ర టెస్టోస్టిరాన్ స్థాయులపై మాత్రం ఎలాంటి ప్రభావమూ చూపదట. ఫలితాల నివేదిక ‘కమ్యూనికేషన్స్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైంది. పురుషులకు సంబంధించినంతవరకూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక సాధనాలు రెండే.. ఒకటి కండోమ్స్ వాడకం. రెండోది వ్యాసెక్టమీ శస్త్రచికిత్స. స్త్రీలకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నట్టు పురుషులకు లేకపోవడానికి కారణమేంటి? ఎంతో పురగతి సాధించిన వైద్య రంగం.. ఈ విషయంలో మాత్రం ఇంకా విజయం సాధించలేకపోవడానికి కారణమేంటి? అంటే.. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. మహిళల్లో అండాల విడుదల దాదాపు నెలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. దానికీ ఒక క్రమం ఉంటుంది. కానీ, పురుషుల్లో నిత్యం కోట్లాది వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుంటుంది. నిరంతరం జరిగే ప్రక్రియను ఆపడం కష్టం. అలాగని అసాధ్యమేమీ కాదు. పురుషుల కోసం గత 60-70 ఏళ్లలో రకరకాల కాంట్రాసెప్టివ్ పిల్స్, జెల్స్, ఇంజెక్షన్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్..!
అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’
సౌరవ్యవస్థలో అరుదైన వస్తువు.. ఏలియన్స్‌కు చెందినదా
ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్ చేశావ్ సామీ
బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్