Annadata Sukhibhava Scheme 2025 Pending: ఏపీ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.. ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు ఇప్పటికి అన్నదాత సుఖీభవ పథకం విషయంలో ఇబ్బందిపడుతున్నారు.. వారందరికి ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.
హైలైట్:
- అన్నదాత సుఖీభవ పథకంపై అలర్ట్
- కొందరు రైతుల పేర్లు జాబితాలో లేవు
- ఆధార్ సహా సమస్యలు ఉన్నాయి

ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ‘పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో మొత్తం 46,85,838 మంది రైతులు లబ్ధి పొందుతారు. మొదటి విడతలో కేంద్రం ‘పీఎం కిసాన్’ పథకం కింద రూ.2 వేలు సాయానికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7వేలు చొప్పున బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు జమ చేస్తుంది. దీనికి అదనంగా కేంద్రం రూ.831.51 కోట్లు అందిస్తుంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పింది.. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6వేలకు.. ఏపీ ప్రభుత్వం రూ.14వేలు కలిపి రూ.20 వేలు ఇస్తోంది.
Chandrababu: కుర్రాడికి క్లాస్ పీకిన చంద్రబాబు.. మంత్రిని చూపిస్తూ, ఆసక్తికర సీన్
రైతులు అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం 155251 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ అన్నదాతా సుఖీభవ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయం, పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో అన్నదాతసుఖీభవ పథకం ప్రారంభోత్స కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. అన్నదాతా సుఖీభవ అందుకునే రైతుల మొబైల్స్‌కు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సమాచారం పంపాలని సూచించారు.