నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మట్టి పాత్రలు, మట్టి సంబంధిత వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాస్తు శాస్త్రంలో మట్టితో చేసిన అనేక వస్తువులు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టితో చేసిన వస్తువులను ఉపయోగించే ఇంట్లో లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ స్థిర నివాసం ఏర్పారచుకుంటుందని విశ్వసిస్తారు. నిషి అదృష్టాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో ఎలాంటి మట్టి వస్తువులను ఉంచాలో ఇక్కడ తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం..ఇంట్లో మట్టితో చేసిన దేవుళ్ల విగ్రహాలను ఉంచడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. మట్టితో చేసిన దేవతా విగ్రహాలను పూజించడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదిదేవుడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసినది ఉండాలని చెబుతున్నారు. అలా చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మట్టితో చేసిన విగ్రహాలను ఉత్తర దిశలో ఉంచి పూజించడం వల్ల ఇంట్లో అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి.
అలాగే, ఇంట్లో మట్టి కుండ ఉండటం కూడా శ్రేయస్కరం అంటున్నారు వాస్తు నిపుణులు. పూజా సమయంలో మట్టి కుండలోని నీటిని ఉపయోగించడం మంచిదని ధర్మ గ్రంధాలు చెబుతున్నారు. మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. మట్టికుండ జీవితానికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. మట్టి కుండలోని నీటిలో వెండినాణెం వేసి ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి, ఐశ్వర్య ప్రాప్తికి కారకంగా మారుతుందని విశ్వసిస్తారు. ఇంటికి తూర్పు దిశలో నీటితో నిండిన కుండను ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనివల్ల దేవతల ఆశీస్సులు ఎప్పుడూ మీ ఇంటిపై ఉండేలా చూస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇకపోతే, సాయంత్రం వేళల్లో ఇంటి తలుపు దగ్గర, తులసి మొక్క దగ్గర మట్టి దీపం వెలిగించాలని చెబుతున్నారు. ఇది మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును నిర్ధారిస్తుందని అంటున్నారు. మట్టి దీపం పంచతత్వానికి చిహ్నం. అందువల్ల మట్టి దీపపు కుందె ఇంట్లో ఉండడం మంచిదని చెబుతున్నారు. అలాగే, ఇంట్లో మట్టి బొమ్మలు ఉండడం కూడా వాస్తు ప్రకారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇవి మీ ఇంట్లో సానుకూలత, ప్రశాంతతను కలిగిస్తాయని చెబుతున్నారు.
చాలా మంది తమ ఇళ్లల్లో మొక్కలు పెంచుతుంటారు. ఇంట్లో పెంచుకునే మొక్కల కోసం అందంగా కనిపించేందుకు గానూ సిరామిక్, ప్లాస్టిక్ కుండీలలో పెంచుతున్నారు. కానీ వాస్తు ప్రకారం మట్టి కుండీలలో మొక్కలు నాటడం మంచిదని చెబుతున్నారు. మట్టి కుండీలలో మొక్కలు పెంచడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Note : ఈ వార్తలో చెప్పిన సమాచారం కేవలం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..