Ap Deepam 2 Scheme Third Cylinder Booking: ఏపీలో మహిళలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించింది. నేటి నుంచి మూడో విడత గ్యాస్ సిలిండర్ల బుక్ ప్రారంభమవుతుంది. రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ జులై 31తో ముగిసింది. ఇప్పుడు మూడో సిలిండర్ బుకింగ్ మొదలైంది. అలాగే సిలిండర్ కోసం డబ్బుల్ని ముందే కట్టాల్సిన అవసరం లేకుండా మరో నిర్ణయం తీసుకుంది.

గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు జమ కాకపోతే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారులకు రాయితీ డబ్బులు ఖాతాలో జమ కాకపోతే ఫిర్యాదు చేయొచ్చు. సచివాలయం, ఎంపీడీవో కార్యాలయం, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. 1967 నంబర్‌కు ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు. ఈకేవైసీ సమస్య ఉంటే గ్యాస్ ఏజెన్సీని కలవాలి. .సాంకేతిక సమస్య ఉంటే అధికారులు పరిష్కరిస్తారు.
ఒకే సీన్‌లో ఏడిపించగలరు, భయపెట్టగలరు.. నేను సీఎంగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే అయ్యారు: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం దీపం-2 పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకురానుంది. గతంలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత కొనుగోలు చేసిన తర్వాత రాయితీ డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. దీని వల్ల లబ్ధిదారులు ముందు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని తొలగించడానికి ప్రభుత్వం నేరుగా చెల్లింపులు చేసేలా చూస్తోంది. లబ్ధిదారులు ముందుగా సిలిండర్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సిలిండర్ ఇంటికి చేరినప్పుడే డబ్బులు చెల్లించేలా డిజిటల్ వ్యాలెట్ యాప్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాలెట్‌లో జమ చేసిన డబ్బును సిలిండర్ కొనుగోలుకు మాత్రమే ఉపయోగించాలి. ఇతర అవసరాలకు వాడుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేస్తారు.