Andhra Pradesh School Students Transport Allowance Guidelines 2025: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అందిస్తోంది.. నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది.. మొత్తం పది నెలలకు గాను రూ.6వేలు ఇస్తారు. అయితే తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్
- ఒక్కొక్కరికి రూ.6వేలు లెక్కన ఇస్తారు
- మార్గదర్శకాలు కూడా జారీ చేశారు

విద్యా హక్కు చట్టం ప్రకారం.. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు టీఏ (ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్) పొందే అవకాశం ఉంది. పిల్లలు ఉండే చోటు నుంచి ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం ఉంటే డబ్బులు ఇస్తారు. ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే కూడా డబ్బులు ఇస్తారు. సెకండరీ పాఠశాల ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే రవాణా భత్యం ఇస్తారు. ఒక్కో విద్యార్థికి నెలకి రూ.600 చొప్పున అందిస్తారు.. ఏడాదికి అయితే రూ.6 వేలు ఇస్తారు. ఈ డబ్బుల్ని విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడానికి బస్సు లేదా ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్‌కు జమ చేస్తారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాదు.
అమరావతిని సింగపూర్ చేయడమే చంద్రబాబు ధ్యేయం.. అదే పర్యటన ఉద్దేశం: రాంప్రసాద్ రెడ్డి
పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అర్హులైన విద్యార్థులను గుర్తించి.. వారి వివరాలను లీప్ యాప్‌లో నమోదు చేసింది. అనంతరం ఎంఈవోలు పరిశీలిస్తే సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ధృవీకరిస్తారు. ఆగస్టు 10 నాటికి లబ్ధిదారుల తుది జాబితాను అధికారులు ఖరారు చేస్తారు.. త్వరలోనే అర్హులైన విద్యార్థులకు టీఏ జమ చేస్తారు. ప్రతి ఏటా 10 నెలల పాటూ ఈ ట్రావెల్ అలవెన్స్ అందజేస్తారు. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు.