
నాలుగు రోజుల సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగిందన్నారు మంత్రి నారా లోకేష్. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో సూపర్ సక్సస్ అయ్యామని తెలిపారు. సీఎం చంద్రబాబు స్పీడ్‌ను మ్యాచ్ చేయలేకపోయినప్పటికీ ఆయన అంచనాలను అందుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో సింగపూర్ నుంచి ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు తెలిపారు. MOUల్లాంటివేం లేవ్, అంతా ఎగ్జిక్యూషనే అంటూ సింగపూర్ పర్యటన అంశాలను లోకేష్ చెప్పుకొచ్చారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం లోకేష్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఏపీకి పారిశ్రామిక వేత్తలు రాలేదని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.
వైసీపీ వల్ల గ్లోబల్‌గా ఏపీ పరిపతి అంతా పోయిందన్నారు నారా లోకేష్. సింగపూర్ టీమ్‌తో జగన్ వ్యవహరించిన తీరు వాళ్లను ఎంతో బాధించిందన్నారు. అవినీతికి మీనింగే తెలియని వాళ్లపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎంతో దారుణమన్నారు. అయినప్పటికీ వాళ్లను ఒప్పంచి.. మెప్పించి మళ్లీ ఏపీకి తీసుకొస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. గతంలో చేసిన తప్పులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్టుబడుల కోసం సింగపూర్‌లో సీఎంతో పాటు మంత్రులంతా కష్టపడుతుంటే చెడగొట్టే ప్రయత్నం చేశారంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మారబోతోంది పెట్టుబడులు పెట్టొద్దంటూ సింగపూర్ పారిశ్రామికవేత్తలకు మెయిల్స్ పెడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తంగా… సింగపూర్ పర్యటనపై కీలక విషయాలు వెల్లడించిన లోకేష్ ఏపీకి నష్టం చేయాలని చూసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్న వైసీపీ నేతలు వాస్తవంలోకి రావాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.