
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 17వేల కోట్ల లోన్‌ఫ్రాడ్, మనీ లాంగరింగ్‌కు సంబంధించిన ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఈ నెల ఐదున విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులలో ఈడీ అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే అనిల్ అంబానీపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. యెస్ బ్యాంక్ నుంచి మూడువేల కోట్ల రూపాయల రుణం తీసుకుని, దారిమళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో CBI కేసు ఆధారంగా ED మొన్నీమధ్య ఆయన సంస్థల్లో సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ED నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఇప్పటికే అనిల్ అంబానీ సంస్థలపై ED సోదాలు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద గత నెల 24వ తేదీన ఆయనకు చెందిన మొత్తం కంపెనీలు, ఆయన బిజినెస్ పార్ట్‌నర్స్ అయిన 25 మంది ఇళ్లుతో సహా వాళ్లకు చెందిన కంపీనీలు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించిన 35 పైగా కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీ అధికారులు మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.