మన రోజువారీ ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆపిల్ నుంచి అవాకాడో వరకు ప్రతి పండు శరీరానికి విలువైన పోషకాలను అందిస్తుంది. వీటిని మామూలుగా తినడమే కాకుండా.. షేక్స్, జ్యూస్ లు, సలాడ్‌లు, స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు. జామ, అవాకాడో ఈ రెండింటిలో ఏది మీ ఆరోగ్యానికి ఎక్కువ మంచిది..? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు, పోషక విలువలు, ఆరోగ్య లాభాలు, వాటిని ఎలా తినాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
100 గ్రాముల జామలో ఉండే పోషకాలు
- కేలరీలు – 68
- ఫైబర్ – 5.4 గ్రాములు
- విటమిన్ C – 228 మిల్లీగ్రాములు (రోజువారీ అవసరానికి 250 శాతం పైగా)
- ఆరోగ్యకరమైన కొవ్వులు – 0.9 గ్రాములు
- ప్రోటీన్ – 2.6 గ్రాములు
- పొటాషియం – 417 మిల్లీగ్రాములు
జామ తినడం వల్ల కలిగే లాభాలు
- బలమైన రోగనిరోధక శక్తి.. దీనిలో విటమిన్ C చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది.
- యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే డ్యామేజ్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లు జామలో పుష్కలంగా ఉంటాయి.
- బరువు తగ్గడానికి సహాయం.. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి పండు.
- రక్తపోటు అదుపు.. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
- మధుమేహానికి బెస్ట్.. దీనికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు.
ఎలా తినాలి..?
జామను ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు, కారం చల్లి తినవచ్చు. జామ పేస్ట్, జ్యూస్, లేదా చట్నీగా కూడా తయారు చేసుకోవచ్చు.
100 గ్రాముల అవాకాడోలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు
- కేలరీలు – 160
- ఫైబర్ – 6.7 గ్రాములు
- విటమిన్ C – 10 మిల్లీగ్రాములు
- ఆరోగ్యకరమైన కొవ్వులు – 15 గ్రాములు
- ప్రోటీన్ – 2 గ్రాములు
- పొటాషియం – 485 మిల్లీగ్రాములు
అవాకాడో తినడం వల్ల కలిగే లాభాలు
- గుండెకు మేలు.. ఇందులో ఉండే మోనో అన్‌సాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.
- చర్మం, కళ్లకు రక్షణ.. విటమిన్ E, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. అలాగే లూటీన్, జియాక్సంతిన్ కంటి చూపును కాపాడతాయి.
- మెరుగైన జీర్ణక్రియ.. ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
- మెదడుకు పోషణ.. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
ఎలా తినాలి..?
అవాకాడోను మెత్తగా చేసి టోస్ట్‌పై స్ప్రెడ్‌గా తినడం ఒక ట్రెండీ మార్గం. దీన్ని సలాడ్ లలో, స్మూతీ లలో కలిపి లేదా గ్వాకామోల్‌గా తయారు చేసి శాండ్‌విచ్‌లలో ఉపయోగించవచ్చు.
జామ వర్సెస్ అవాకాడో: ఏది బెస్ట్..?
ఈ రెండు పండ్లూ వేర్వేరు రకాల ఆరోగ్య లాభాలను అందిస్తాయి. ఏది మంచిదనేది మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
జామ.. ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నవారు జామను ఎంచుకోవచ్చు. దీనిలో తక్కువ కేలరీలు, ఎక్కువ విటమిన్ C ఉంటాయి.
అవాకాడో.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునేవారు, చర్మం, మెదడుకు పోషణ కావాలనుకునేవారు అవాకాడోను తీసుకోవచ్చు. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
పోషక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెండింటినీ సమతుల్యంగా మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్య లాభాలను పొందవచ్చు. ఒక పండును వదిలేసి మరొకటి మాత్రమే తీసుకోవడం కన్నా.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని తినడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)