అప్పుడప్పుడు మనకు రోడ్డు మీద చిల్లర నాణేలు, కరెన్సీ నోట్లు కూడా పడిపోయి దొరుకుతుంటాయి. అలా రోడ్డు మీద డబ్బులు దొరకడం కొందరు శుభ సూచకంగా భావిస్తారు. మరికొందరు, నష్టానికి సంకేతంగా భావిస్తారు. అలా దొరికిన డబ్బును కొంతమంది తీసుకుని సొంత ఖర్చులకు వాడుకుంటారు. మరికొందరు బిచ్చగాళ్లకు వేస్తుంటారు. లేదంటే, గుడిలో విరాళంగా ఇస్తుంటారు. అయితే, ఇటీవల, బృందావనంలోని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ జీ మహారాజ్ రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఏం చేయాలో చెప్పారు. రోడ్డు మీద దొరికిన డబ్బును మన దగ్గరే ఉంచుకోవాలా అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రేమానంద్ జీ మహారాజ్ ఇలా వివరణ ఇచ్చారు..
రోడ్డు మీద దొరికిన డబ్బును మీ దగ్గరే ఉంచుకోకూడదని ప్రేమానంద్ జీ మహారాజ్ వెల్లడించారు. ఎందుకంటే ఈ డబ్బు వేరొకరిది.. దానిని తీసుకోవడం, ఖర్చు చేసుకోవడం సరైనది కాదని అన్నారు. రోడ్డు మీద డబ్బు దొరకడం శుభసూచకంగా భావిస్తారని, కానీ దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకోకూడదని మహారాజ్ జీ చెప్పారు. ఎందుకంటే అలా చేయడం ఒకరి డబ్బును దొంగిలించినట్లే అవుతుందని ఆయన అన్నారు.
మీరు రోడ్డుపై డబ్బు దొరికితే దాన్ని తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే లేదా మీ అవసరాలకు ఖర్చు చేస్తే మీరు పాపం చేసినట్టే అవుతుంది.. కాబట్టి దారిలో దొరికిన డబ్బును తీసుకుని మీ సొంత ఖర్చులకు వాడకుండా దానిని మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించాలి లేదా ఆలయానికి దానం చేయాలని ప్రేమానంద్ జీ మహారాజ్ వెల్లడించారు. అంతేకాకుండా, రోడ్డు మీద దొరికిన డబ్బుతో ఆవులకు సేవ చేసినా కూడా మీకు పుణ్యం లభిస్తుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
రోడ్డు మీద దొరికిన డబ్బును ఆవు లేదా మరే ఇతర జీవికి సేవ చేయడానికి ఉపయోగిస్తే, ఇద్దరూ దాని నుండి ప్రయోజనం పొందుతారు. అంటే డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి, అలా ఒకరు పొగొట్టున్న డబ్బు దొరికిన వ్యక్తి కూడా అంటున్నారు ప్రేమానంద్ జీ మహారాజ్.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..