Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

2 August 2025

Ambati Rambabu,చిట్టినాయుడు దెబ్బకి చంద్రబాబు బుర్ర పోయింది.. అంబటి ఫైర్ – ambati rambabu fires on chandrababu and lokesh over ys jagan nellore tour

2 August 2025

Gold Price Today: మళ్లీ లక్ష దాటనున్న బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Anakapalli Heavy Fine For Pioneer Lorries,అనకాపల్లి: లారీ డ్రైవర్లకు రూ.4 లక్షల వరకు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా! – mvi fined rs 3 lakh 92 thousand thousand to pioneer lorries in anakapalli district
ఆంధ్రప్రదేశ్

Anakapalli Heavy Fine For Pioneer Lorries,అనకాపల్లి: లారీ డ్రైవర్లకు రూ.4 లక్షల వరకు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా! – mvi fined rs 3 lakh 92 thousand thousand to pioneer lorries in anakapalli district

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anakapalli Heavy Fine For Pioneer Lorries,అనకాపల్లి: లారీ డ్రైవర్లకు రూ.4 లక్షల వరకు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా! – mvi fined rs 3 lakh 92 thousand thousand to pioneer lorries in anakapalli district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Heavy Fine For Pioneer Lorries In Anakapalli: మూడు రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పయనీర్ కంపెనీకి వెళుతున్న లారీలను ఆపారు. ఓవర్ లోడుతో వెళుతున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆ ఏడు లారీaను స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా ఈ లారీలకు ఎంవీఐ భారీగా జరిమానా విధించారు. ఈ లారీలు పయనీర్ కంపెనీకి ఓవర్ లోడ్‌తో వెళుతున్న విసయాన్ని తెలిసి కఠిన చర్యలు తీసుకున్నారు.

హైలైట్:

  • అనకాపల్లి జిల్లాలో లారీలకు భారీగా జరిమానా
  • ఏకంగా రూ.3,92000 వేలు జరిమానా విధించారు
  • మూడు రోజుల క్రితం ఈ లారీలను ఆపిన స్పీకర్
అనకాపల్లి పయనీర్‌ లారీలకు భారీ జరిమానా
అనకాపల్లి పయనీర్‌ లారీలకు భారీ జరిమానా (ఫోటోలు– Samayam Telugu)

అనకాపల్లి జిల్లాలో లారీలకు భారీ జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి లోడ్ తీసుకెళుతున్నారని గుర్తించారు.. అందుకే ఎంవీఐ (మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్) జరిమానా విధించారని. మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వెళుతున్నారు. ఈ క్రమంలో మాకవరం మండలం రాజుపేట దగ్గర అధిక లోడుతో వెళుతున్న పెద్ద ట్రక్కుల్ని (లారీలు) గుర్తించారు. వెంటనే తన కారును ఆపి.. ఆ లారీలను అడ్డుకున్నారు.. ఇవ రాచపల్లిలో ఉన్న పయనీర్ కంపెనీకి ముడిసరుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు, రవాణశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. ఓవర్ లోడ్‌తో వస్తున్న టిప్పర్ల కారణంగా తాళ్లపాలెం బ్రిడ్జితో పాటు రోడ్లు ధ్వంసం అవుతాయని స్పీకర్‌ ఆందోళన వ్యక్తంచేశారు.ఈ క్రమంలో పోలీసులు ఏడు లారీలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ లారీలను జరిమానాలు విధించడానికి నర్సీపట్నం రవాణా శాఖ అధికారులకు అప్పగించగా.. వారు లారీలను తనిఖీ చేసి, పరిమితికి ముడి సరకును రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం ఏడు లారీలకు రూ.3,92,000 జరిమానా విధించారు. మొత్తం మీద ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలను ఆపి.. ఓవర్‌లోడ్‌ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రోడ్డు, వంతెనలు దెబ్బ తినకుండా చర్య తీసుకున్నారు. తాళ్లపాలెం వంతెన ఇప్పటికే శిథిలావస్థలో ఉందంటున్నారు అయ్యన్నపాత్రుడు. ఇప్పుడు ఈ లారీలు అధిక లోడుతో వెళితే కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

సలామ్ సైనిక ట్రైలర్ లాంచ్ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అనకాపల్లి దగ్గర రాచపల్లి వయా తాళ్లపాలెం మార్గంలో వంతెనలు బలహీనంగా ఉన్నాయి. అయితే పయనీర్ అల్యూమినియం పరిశ్రమకు ఓవర్లోడ్‌తో లారీలు వెళ్లడమే దీనికి కారణం అనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వాటిని పరిశీలించారు. తాజాగా నేరుగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ వ్యవహారంలో రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. మరి ఇకనైనా ఆ లారీల యజమానులు నిబంధనలు పాటిస్తాయా లేదా అన్నది చూడాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి