
చాలా తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది చాలా మందికి ఉన్న సమస్య. ఇది మన ఆరోగ్యం, పోషకాహార లోపం, ఒత్తిడి లేదా జీవనశైలి మార్పుల వల్ల జరగవచ్చు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే కొన్ని సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్ లు ఉన్నాయి. బూడిద జుట్టును నల్లగా మార్చే సహజ చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- హెన్నా, ఉసిరి ప్యాక్.. హెన్నా ఆకులు జుట్టుకు సహజమైన రంగును ఇస్తాయి. వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక స్పూన్ ఉసిరి పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది వారానికి రెండు సార్లు చేస్తే బూడిద జుట్టు నల్లగా మారుతుంది.
- కాఫీ ప్యాక్.. కొద్దిగా కాఫీ పౌడర్ ను నీటితో కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి ఒక గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు బూడిద రంగు తగ్గి నల్లగా అవుతుంది.
- ఉసిరి నూనె.. ఉసిరి నూనెను వారానికి రెండు సార్లు తలకు మర్దన చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు పోషణ లభిస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బూడిద జుట్టు రాకుండా చేస్తుంది.
- మెంతి, నిమ్మ, అలోవెరా మిశ్రమం.. కొన్ని మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి.. ఆ నీటిని మరిగించి చల్లార్చాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం, అలోవెరా జెల్ కలిపి ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. ఇది వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
- చమోమిలే ఆకుల ప్యాక్.. చమోమిలే ఆకులలో జుట్టును నల్లగా ఉంచే పోషకాలు ఉంటాయి. ఈ ఆకులను మెత్తగా చేసి జుట్టుకు రాసి.. పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బూడిద జుట్టు సమస్య తగ్గుతుంది.
ఈ చిట్కాలు పూర్తిగా సహజమైనవి కాబట్టి రసాయనాల వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఉండవు. మంచి ఫలితాలు రావాలంటే వీటిని క్రమం తప్పకుండా పాటించాలి. ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించి మీరు వయసుకు తగ్గ జుట్టు ఆరోగ్యాన్ని పొందవచ్చు.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)