సినీరంగంలో వెండితెరపై అలరించే చాలా మంది జీవితాలు అంత లగ్జరీగా ఉండవు. బిగ్ స్క్రీన్ పై నటనతో కట్టిపడేసే తారల జీవితాల్లో చీకటి కోణాలు చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడి జీవితం కూడా అంతే. 12 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. కానీ 30 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బెంగుళూరుకు చెందిన ఈ నటుడు ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చాడు. చర్చిగేట్ స్టేషన్ సమీపంలోని వీధిలో నివసించాడు. అప్పుడే ఓ మహిళ అతడిని రోజు తనతోపాటు యాక్టింగ్ వర్క్ షాప్ కు వస్తే రూ.20 ఇస్తానని చెప్పింది.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
1988లో మీరా నాయర్ సినిమా సలాం బాంబేకు ఎంపికయ్యాడు. ఈ చిత్రంలో అతడు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ మూడు అకాడమీ అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలకు సమానం. ఇక ఈ నటుడి పేరు షఫీక్ సయ్యద్. సలాం బాంబే చిత్రం అనేక ఆవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా షఫీక్ జాతీయ అవార్డ్ అందుకున్నారు. అప్పుడు అతడి వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా తర్వాత, షఫీక్ 1994లో వచ్చిన ‘పతంగ్’ చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ తర్వాత మరో సినిమా చేయలేదు. అవకాశాలు రాకపోవడంతో తిరిగి బెంగుళూరుకు వచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
కుటుంబ బాధ్యతల కోసం ఆటో డ్రైవర్ గా మారారు. షఫీక్ కుటుంబంలో 5 మంది బాధ్యత అతనిపై ఉంది. 1994 షఫీక్ చివరి చిత్రం. 31 సంవత్సరాలుగా బెంగుళూరులో ఆటో నడుపుతున్నారు. ఇప్పుడు అతడినికి ఒక కుమారుడు ఉన్నారు.
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..