హైదరాబాద్‌లో పిల్లలకి ABCDలు నేర్పించడమంటే ఇప్పుడు చాలా పెద్ద విషయమండోయ్. ఎందుకంటే అందుకు అయ్యే ఖర్చు నెలకు రూ. 21,000. అవును, మీరు కరెక్ట్‌గానే చదువుతున్నారు. ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఈ లెవెల్ లో ఫీజులు వసూలు చేస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టెడ్ఎక్స్ స్పీకర్ అనురాధ తివారీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో ఓ రేంజ్ కామెంట్స్ వస్తున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ డబ్బుతో ఏడాది బ్రతుకుతుంది కదా అని ఒకరు కామెంట్ పెట్టారు. విద్య ఎప్పుడో వ్యాపారం అయింది అని మరొకరు అన్నారు. పిండి కొద్ది రొట్టె.. అందుకు తగ్గటే అక్కడ స్టాండర్డ్స్ ఉంటాయి. మీకు స్తోమత ఉంటేనే అక్కడికి పంపండి అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. విద్య గురించి పక్కన పెడితే.. స్కూల్స్ ఎప్పుడో స్టేటస్ సెంటర్స్ అయిపోయాయి.
కాగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజులపై నియంత్రణ అవసరం అనే అభిప్రాయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తాజగా .. తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అనే బిల్లును తీసుకురాబోతుంది. ప్రజెంట్ ఈ బిల్లు రివ్యూ స్టేజ్‌లో ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే తమ పిల్లను ప్రవేటు స్కూల్‌కు పంపించే మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారం తగ్గనుంది.
Class- NurseryFees – Rs 2,51,000/-
Now, learning ABCD will cost you Rs 21,000 per month.
What are these schools even teaching to justify such a ridiculously high fee? pic.twitter.com/DkWOVC28Qs
— Anuradha Tiwari (@talk2anuradha) July 30, 2025
ఇక ఈ స్కూల్ విషయానికి వస్తే.. 1965లో దీన్ని స్థాపించారు. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా నామమాత్రపు ఫీజుతో మంచి విద్యను అందిస్తుందని గుర్తింపు పొందింది ఈ స్కూల్. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.