ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మన జుట్టు, ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. దీని వల్ల జుట్టు రాలడం, నరాలు బలహీనపడటం లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు తల మసాజ్ ఒక సహజమైన, తేలికైన పరిష్కారం. వారానికి కనీసం మూడు సార్లు తల మసాజ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.
తల మసాజ్ వల్ల కలిగే లాభాలు
- ఒత్తిడి తగ్గుతుంది.. తల మసాజ్ చేయడం వల్ల నరాలు విశ్రాంతి పొంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.
- మెదడు పనితీరు మెరుగుపడుతుంది.. మసాజ్ చేసినప్పుడు మెదడు చుట్టూ ఉన్న భాగాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు కావాల్సిన ఆక్సిజన్, పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది.
- జుట్టు పెరుగుదల.. తలపై వేళ్లతో మెల్లగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై జుట్టు మూలాలు ఉత్తేజితమవుతాయి. దీని వల్ల జుట్టు వేగంగా, బలంగా పెరుగుతుంది.
- చుండ్రు తగ్గుతుంది.. తలపై ఉన్న చనిపోయిన కణాలు తొలగిపోతాయి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
- శక్తి పెరుగుతుంది.. తల మసాజ్ వల్ల కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గి తలనొప్పులు తగ్గుతాయి. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- నూనె.. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కొద్దిగా వేడి చేసి తలకు అప్లై చేయాలి.
- మసాజ్ పద్ధతి.. వేళ్లతో నెమ్మదిగా గుండ్రంగా మసాజ్ చేయాలి. నుదురు, తల మధ్య భాగం, కీళ్ళ ప్రాంతాల్లో కొంత ఒత్తిడితో మసాజ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
- సమయం.. ఒకసారి మసాజ్ చేసిన తర్వాత 30 నిమిషాల పాటు నూనెను తల మీద ఉంచి ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ముఖ్య సూచన.. మీకు తల మీద ఏమైనా చర్మ సమస్యలు లేదా ఇతర సమస్యలు ఉంటే మసాజ్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
(ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దీన్ని వైద్య సలహాగా భావించవద్దు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం)