రైలులో ఒక చిన్న అమ్మాయి-పోలీసు అధికారి మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి టీవీలో కార్టూన్ షోలలో మాత్రమే పోలీసులను చూసింది. అయితే ఆమె ముందు నిజమైన పోలీసును మొదటిసారి చూసినప్పుడు, ఆమె స్పందన అందరి హృదయాలను గెలుచుకుందని వీడియో క్లిప్‌లో పేర్కొన్నారు.
ఈ వీడియోను లతీఫా మండల్ అనే వినియోగదారుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్ వీడియో ప్రారంభంలో, ఒక పోలీసు అధికారి రైలులో తనిఖీ చేస్తున్నారు. రైలు బోగిలోని పై బెర్త్‌లో కూర్చున్న అమ్మాయికి ‘హ్యాపీ జర్నీ’ అని చెబుతున్నట్లు వినబడుతుంది. దీని తర్వాత, వీడియో రికార్డ్ చేస్తున్న మహిళ, బహుశా ఆమె తల్లి అయి ఉండవచ్చు. ఆ చిన్నారిని పోలీస్ అధికారికి ‘ధన్యవాదాలు’ చెప్పమని అడుగుతుంది.
దీని తరువాత, ఆ అమ్మాయి ఉత్సాహంగా ‘హై ఫైవ్’ అని చెబుతుంది. పోలీసు అధికారి సైతం సంతోషంగా ఆమెకు హై ఫైవ్ ఇచ్చాడు. ఇంతలో, ఆ అమ్మాయి, ఎలా ఉన్నావు? అని సదరు పోలీస్ ఆఫీసర్‌ను అడుగుతుంది. అప్పుడు ఆ అధికారి కూడా నవ్వుతూ, నేను బాగున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఆ చిన్నారి చిట్టిపొట్టి మాటలతో ఆ పోలీస్ అధికారి ముగ్ధడయ్యాడు. తొలిసారి నిజమైన పోలీసును చూసిన ఆ చిన్నారి సంభ్రమాశ్చర్యానికి గురైంది.
యూజర్ లతీఫా మండల్ ప్రకారం, ఆ అమ్మాయి నిజమైన పోలీసును కలవడం ఇదే మొదటిసారి. దీనికి ముందు, ఆమె టీవీలో కార్టూన్ షోలలో మాత్రమే పోలీసులను చూసింది. తన ముందు ఉన్న పోలీసు అధికారిని చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయిందని వీడియోలోని మహిళ చెప్పింది. ఆ అమ్మాయి ఈ అందమైన వీడియోపై ఇంటర్నెట్ వినియోగదారులు.. తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఒక యూజర్ యూనిఫాంలో ఉన్న మర్యాదగా వ్యాఖ్యానించారు. మరొకరు, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో అన్నారు. మరొక యూజర్, ఆ పోలీసు ఒక అమ్మాయికి తండ్రి అయి ఉండాలి అని రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..