కంత్రీ డ్రాగన్ కంట్రీ చైనా భారత్‌పై మరోమారు తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా మన భగవంతుడి ఫోటోలతో డోర్‌మ్యాట్‌లను తయారు చేసింది. చైనా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీఎక్స్‌ప్రెస్ జగన్నాథుడి చిత్రం ఉన్న డోర్‌మ్యాట్‌లను విక్రయిస్తోందని వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా భక్తులు భగ్గుమన్నారు. ఒడిశాలో తీవ్ర దుమారం చెలరేగింది. జగన్నాథుని చిత్రాన్ని డోర్‌మ్యాట్‌లపై ముద్రించి ఉత్పత్తులను అమ్మడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా. ఇలాంటి చర్యలు హేయమైనవంటూ ఘాటుగా విమర్శించారు. సదరు సంస్థ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
భారతదేశంలో ఆగ్రహాజ్వాలాలు చెలరేగిన తరువాత చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీఎక్స్‌ప్రెస్ జగన్నాథుని పవిత్ర చిత్రం ఉన్న డోర్‌మ్యాట్‌ను తొలగించింది. లార్డ్ జగన్నాథ్ మండల ఆర్ట్ మ్యాట్ డోర్ వే అనే పేరుతో ఉన్న ఈ ఉత్పత్తి ధర రూ. 787.65లు సంస్థ ప్రకటించింది. హిందూ మతంలో ముఖ్యంగా ఒడిశాలో అత్యధికంగా భక్తులు పూజించే దేవత చిత్రాన్ని కలిగి ఉన్న ఇలాంటి మ్యాట్‌పై నిలబడి ఉన్న వ్యక్తిని చూపించే ఆ ఫోటోలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీనిపై భారతదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిదాతో సహా చాలా మంది నాయకులు, కళాకారులు, సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై తీవ్రంగా స్పందించారు.
Mahaprabhu Jagannath is deeply connected to the soul and emotions of every Odia. I strongly condemn Chinese e-commerce platform @AliExpress_EN for selling doormats featuring Mahaprabhu Jagannath’s image. @AliExpress_EN must remove the listing immediately and apologise to devotees…
— Pravati Parida (@PravatiPOdisha) July 30, 2025
మహాదేవుడు జగన్నాథుడు ప్రతి ఒడియా వ్యక్తి ఆత్మ, భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాడు. మహాప్రభు జగన్నాథుని చిత్రంతో డోర్‌మ్యాట్‌లను అమ్ముతున్నందుకు చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీఎక్స్‌ప్రెస్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు వెంటనే ఈ జాబితాను తొలగించాలి. అలాగే, ఈ అభ్యంతరకరమైన చర్యకు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
I vehemently condemn the egregious act of selling doormats with the sacred image of Lord Jagannath on AliExpress! This shameless profanity is an affront to the deepest sentiments of millions of devotees, trampling upon the revered iconography with utter disregard. It’s a… pic.twitter.com/pnPOVA2Pl1
— Dr. Amar Patnaik (@Amar4Odisha) July 29, 2025
బిజు జనతాదళ్ (బిజెడి) జాతీయ ప్రతినిధి, ఎంపి అమర్ పట్నాయక్ సైతం స్పందించారు. ఎక్స్ వేధికగా ఇలా రాశారు.. ఈ సిగ్గులేని చర్య లక్షలాది మంది భక్తుల మనోభావాలను అవమానించడమే. ఈ ఘోరమైన నేరాన్ని సరిదిద్దడానికి, భగవంతుని గౌరవాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్య అవసరం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..