ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక క్యాన్సర్లు అనేక రకాలు. బోన్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, లంగ్ క్యాన్స్, బ్లడ్ క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయి. ఒక్కో దాని లక్షణం ఒక్కో రకంగా ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం బ్లడ్ క్యాన్సర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.
బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైన సమస్య, ప్రమాదకర వ్యాధి అయినప్పటికీ దీని లక్షణాలు మాత్రం చాలా సాధారణంగా ఉంటాయి. తీవ్రమైన అలసట, నీరసం, తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. ఇక బ్లడ్ క్యాన్సర్ అనేది ఎముకలపై శరీరం తీవ్ర ప్రభావం చూపుతుంది. అసాధారణమైన కణాల పెరుగుదల సాధారణ రక్త కణాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. దీంతో రక్త కణాల వృద్ధి జరగక, అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయంట.
బ్లడ్ క్యాన్సర్, రక్తం, ఎముక మజ్జ, శోషరస, రక్త కణాలపై దాని ప్రభావం చూపుతుంది. లింఫోమా, మైలోమా, లుకేమియా వంటి వివిధ క్యాన్సర్స్ కూడా ఇందులో ఉన్నాయంట. లుకేమియా అనేది చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తే, 16 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్నవారిలో లింఫోమా ఉంటుందంట. ఇక చాలా మంది లుకేమియాతో బాధపడుతున్నట్లు సమాచారం. లుకేమియా ఉన్న వారిలో రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం బాగా తగ్గిపోతుంది.
ఇది మెల్ల మెల్లగా రక్తహీనత, అలసట, వంటి సమస్యలకు దారితీస్తుందంట. దీంతో పదే పదే తల తిరుగుతున్నట్లు అనిపిస్తే తప్పక వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక బ్లడ్ క్యాన్సర్ లక్షణాల్లోకి వెళ్లితే.. వివరించలేని విధంగా బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం, ఎముకలు లేదా కీళ్ల నొప్పుల వంటివన్నీ బ్లడ్ క్యాన్సర్ లక్షణాలేనంట.
బ్లడ్ క్యాన్సర్ ఉన్న వారికి ప్రారంభంలోనే బరువు విపరీతంగా తగ్గిపోతారంట. అదే విధంగా పదే పదే జ్వరం, చర్మం, నోటిపై పుండ్లు, ముక్కు, నోరు, మల ద్వారం ద్వారా విపరీతమైన రక్త స్రావం, శ్వాస ఆడకపోవడం, మూత్రనాళాల నుండి అసాధారణ రక్తస్రావం ఇవన్నీ బ్లడ్ క్యాన్సర్ లక్షణాలేనంట. ఇందులో ఏ ఒక్కటీ కనిపించినా, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.