శక్తివంతమైన గ్రహాల్లో సూర్య గ్రహం ఒకటి. ఇది ఆగస్టు 17న సింహరాశఇలోకి సంచారం చేయనుంది. అంతే కాకుండా ఆగస్టు 30న పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి కూడా సంచారం చేయనున్నాడు. దీంతో ఆగస్టు నెల మొత్తం మూడు రాశులవారికి అద్భఉతంగా ఉండబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
తుల రాశి : తుల రాశి వారికి సూర్య గ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు ప్రతి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడుల్లో అత్యధిక లాభాలు వచ్చి చేరుతాయి.
అంతే కాకుండా ఈ రాశి వారికి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : సింహ రాశి వారికి కూడా ఆగస్టు నెలలో అద్భుతంగా ఉంటుంది. వీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ , ఇవి వీరికి అనేక లాభాలను తీసుకొస్తాయి. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలను అందుకుంటారు. సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్య గ్రహం సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగలకు అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.