బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ప్రస్తుతం స్వల్పంగా తగ్గినా తులం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి తులంపై కేవలం పది రూపాయలు మేత్రమే తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది. అదే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. గత రెండు రోజులో పోల్చుకుంటే 3 వేల రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1 లక్షా 12,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్, కేరళ, చెన్నైలలో లక్షా 22 వేల వరకు ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,640 రూపాయల వద్ద ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
అయితే ప్రస్తుతం ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ రిటైల్ మార్కెట్లో తగ్గడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకిన నేపథ్యంలో బంగారు ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పెరిగిన ధరలను చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ చైన్ కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష రూపాయల పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయి అన్న దానిపైన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి