Andhra Pradesh Rains,ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – imd predicts andhra pradesh weather report that rains from august 4th in these districts
AP Weather Today: ఏపీలో గతవారం వరకు వర్షాలు కురిశాయి.. వరుణుడు బ్రేక్ తీసుకోవడంతో సూర్యుడు రంగంలోకి దిగాడు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అయితే రాష్ట్రంలో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 4 నుంచి మళ్లీ వానలు పడతాయంటున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
హైలైట్:
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్ష సూచన
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్
ఏపీకి వర్ష సూచన (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. వచ్చే రెండు రోజుల్లో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇటు దక్షిణ తమిళనాడు పరిసరాల్లో రానున్న రెండు, మూడు రోజుల్లో ద్రోణి విస్తరించే వాతావరణం ఉందంటున్నారు. ఈ ప్రభావంతో ఈనెల 4వ తేదీన ఉత్తర తమిళనాడుకు ఆనుకుని రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఈ నెల 5 నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ మేరకు అధికారులు శుక్రవారం 8 క్రస్ట్ గేట్లను పదడుగుల మేర ఎత్తి 2,15,424 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మరో 65,592 క్యూసెక్కుల నీరు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పాదన నిమిత్తం నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అంతేకాదు కల్వకుర్తికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.50 అడుగులకు చేరింది. ఇటు నాగార్జున సాగర్ పాజ్రెక్ట్‌కు శ్రీశైలం నుంచి భారీ వరద చేరుతోంది. శుక్రవారం ప్రాజెక్ట్ అధికారులు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,09,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.20 అడుగులుంది. పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 40.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు
‘మరోవైపు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజి వద్ద 3లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరుతుంది. నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నదిలో ప్రయాణించవద్దు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు. జంతువులను నదిలో వదలొద్దు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండి’ అని హెచ్చరించారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి