Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మూడు పెళ్లిళ్లు.. ఏడాది జైలు శిక్ష.. స్టార్ హీరోయిన్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

2 August 2025

మాల్దీవుల ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై బీచ్‌ల్లో నో బికినీ.!

2 August 2025

IND vs ENG : ఓవల్ టెస్టు మూడో రోజు ఆట సాగేనా.. పొంచి ఉన్న వరుణుడు.. వాతావరణం ఎలా ఉందంటే ?

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh July Gst Collection,ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చంద్రబాబు అనుకున్నది సాధించారుగా.. దేశంలో మూడో ప్లేస్ – andhra pradesh records highest ever gst in july 2025 here is details
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh July Gst Collection,ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చంద్రబాబు అనుకున్నది సాధించారుగా.. దేశంలో మూడో ప్లేస్ – andhra pradesh records highest ever gst in july 2025 here is details

.By .2 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh July Gst Collection,ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చంద్రబాబు అనుకున్నది సాధించారుగా.. దేశంలో మూడో ప్లేస్ – andhra pradesh records highest ever gst in july 2025 here is details
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh July Record Gst Collection: ఈ ఏడాది జులైలో రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక రాబడిని పొందింది. 2018 నుంచి 2025 వరకు జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. గత జులై నెలలతో పోలిస్తే ఈ జులైలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి. స్థూలంగా చూసినా, నికరంగా లెక్కించినా ఇదే రికార్డు అని అధికారులు తెలిపారు. ఈసారి జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది.

హైలైట్:

  • జీఎస్టీ వసూళ్లలో ఏపీ అదరగొట్టింది
  • జీఎస్టీ రాబడిలో రికార్డు సృష్టించింది
  • రూ.3,803 కోట్ల స్థూల వసూళ్లు నమోదు
ఏపీ జులైలో జీఎస్టీ వసూళ్లు రూ.2930 కోట్లు
ఏపీ జులైలో జీఎస్టీ వసూళ్లు రూ.2930 కోట్లు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో జులై నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.. ఈ ఏడాది జులైలో రాష్ట్రం జీఎస్టీ రాబడిలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా జీఎస్టీ వసూలు చేసింది. స్థూలంగా చూసినా, నికరంగా లెక్కించినా ఇదే అత్యధికం అని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నికర GST వసూళ్లు జులై నెలలో రూ.2,930 కోట్లు దాటగా, రూ.3,803 కోట్ల స్థూల వసూళ్లు నమోదయ్యాయి.
ఇది గత ఏడాది కంటే 12.12 శాతం ఎక్కువ.. అలాగే 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక వసూలు. ఏప్రిల్ నుంచి జులై వరకు జీఎస్టీ పెరుగుతూ వస్తోంది.. వసూళ్ల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో మొదటి స్థానంలో, దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఎస్‌జీఎస్టీ వసూళ్లు కూడా 14.47శాతం వృద్ధి చెందాయి. ఇది గతేడాది జులై కంటే 10.69 శాతం ఎక్కువ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి.. చంద్రబాబు సమీక్షలు కూాడా నిర్వహించారు. గత రెండు నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.. చంద్రబాబు అనుకున్నది సాధించారు.

ఈ ఏడాది జులైలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి.. 2024 జులైతో పోలిస్తే 12.12% ఎక్కువ వసూళ్లు వచ్చాయి. జీఎస్టీ మొత్తం వసూళ్లలో 14% వృద్ధి కనిపించింది. వస్తువులు, సేవలు ఎక్కువగా కొనడం వల్ల, పన్నుల శాఖ బాగా చూసుకోవడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. గత జులైతో పోలిస్తే ఈ జులైలో ఎస్‌జీఎస్‌టీ వసూళ్లు రూ.1,226 కోట్లు ఎక్కువ వచ్చాయి. ఇది 14.47% పెరుగుదల. వాణిజ్య పన్నుల శాఖ ఈ ఫలితాలను విశ్లేషిస్తోంది. రాష్ట్రానికి ఐజీఎస్‌టీ సర్దుబాటు తర్వాత రూ.1,704 కోట్లు వచ్చాయి. గతేడాది జులైతో పోలిస్తే ఇది 10.69% ఎక్కువ. అంటే, పన్నుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం బాగా పెరిగిందని చెప్పవచ్చు.

ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..

పన్ను ఎగవేతలను అరికట్టడం, ఐజీఎస్‌టీ సర్దుబాట్లు మెరుగుపరచడం, పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి పెరగడం వల్ల ఇది సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. పన్నులు ఎగ్గొట్టకుండా నిఘా పెంచడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు అన్నారు. ఐజీఎస్‌టీ సర్దుబాట్లను సరిచేయడం, పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి పెరగడం కూడా కలిసొచ్చాయని వివరించారు. వృత్తి పన్నులో 55% వసూళ్లు సాధించామని ఆయన తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి