సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో షేర్ చేయబడింది. ఇందులో ఒక పాత తుప్పుబట్టిన కారులో ఏదో కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఏళ్ల తరబడి గ్యారేజీలో పార్క్ చేసి ఉంచిన ఈ కారులోంచి అదే పనిగా ఏదో వింత, ఒకింత భయంకర శబ్ధాలు రావటం గమనించిన గ్యారేజీ సిబ్బంది ఎంటా కారు మొత్తాన్ని పరిశీలించి చూశారు. అందులో కనిపించిన అవతారం చూసి సిబ్బంది సహా అక్కడి స్థానికులు సైతం హడలెత్తిపోయారు. బాబోయ్ ఎలా తప్పించుకోగలం అంటూ పరుగులు తీశారు. ఇంతకీ ఆ కారులో ఏముందంటే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ వీడియో ఒక పాత శిథిలావస్థలో ఉన్న కారుకు సంబంధించినది. దీనిని గత కొన్ని సంవత్సరాలుగా గ్యారేజీలోనే వదిలేశారు. అయితే, ఉన్నట్టుండి ఆ కారు నుండి వింత శబ్దాలు రావటం గ్యారేజీ సిబ్బంది గమనించారు. ఇటీవలి కాలంలో తరచూ కారులోంచి వింతగా శబ్ధాలు వస్తున్నాయి. జుయ్యిమంటూ రాత్రి పగలు తేడా లేకుండా అందరినీ కంగారు పెట్టేస్తున్నాయి ఆ శబ్ధాలు.. దాంతో కారులో ఏముందో చూసేందుకు కారు డోర్ ఓపెన్ చేశారు… అది తెరిచినప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
చాలా కాలంగా కారును అలాగే వదిలేయటంతో లోపల తేనెటీగలు ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాయి. దాని గురించి ఎవరికీ తెలియదు. భారీ సైజులో ఉన్న ఆ తేనెతుట్టే నిండా ఈగలు లక్షల్లో ఉన్నాయి. ఈ భయంకరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను మొదట స్థానిక తేనెటీగల పెంపకందారుడు తన యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో చాలా సంవత్సరాలుగా గ్యారేజీలో ఆపి ఉంచిన పాత కారు నుండి వింతైన శబ్దం వస్తున్నట్లు చూపిస్తుంది. చాలా సంవత్సరాలుగా కారును తాకని గ్యారేజ్ యజమాని మొదట్లో ఏదో చిన్న జంతువు వంటిది లేదంటే ఏ ఎలుక, పిల్లి వంటిది లోపల చిక్కుకున్నట్లు అనుకున్నాడు. కానీ, కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది. వెంటనే తేనెటీగల పెంపకం దారుడికి సమాచారం అందించారు. అతను తేనెటీగలను జాగ్రత్తగా తొలగించి తేనెటీగలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు.
సోషల్ మీడియాలో వీడియో చూసిన ప్రతిఒక్కరూ దీనిపై స్పందించారు. కొంతమంది వినియోగదారులు దీనిని ప్రకృతి అద్భుతం అని, మరికొందరు దీనిని భయానకంగా ఉందని చెప్పారు. ఇది ఒక భయానక చిత్రం లాంటిదని ఇంకొకరు రాశారు. వామ్మో ఇప్పుడు నేను గ్యారేజ్ తెరవడానికి ముందు పదిసార్లు ఆలోచిస్తాను అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. తేనెటీగల పెంపకందారుడిని చాలా మంది ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి