తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరు అందుకున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, పాముల బెడద ఎక్కువవుతుంది. అవి పొలాల నుంచి, పొదాల్లో నుంచి ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం వన్య ప్రాణులకు పుట్టినిల్లు. గుట్టలు, పచ్చని తోటలతో నిత్యం కళకళలాడే ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు, కోతులు, జింకలు వంటి వన్య ప్రాణులు సందడి చేస్తూ ఉంటాయి.
తాజాగా జిల్లాలోని, కవిటి మండలం, మధ్యపుట్టుగ గ్రామ శివారులో శుక్రవారం(ఆగస్టు 01) ఓ నాగుపాము హల్చల్ చేసింది. సుమారు 7అడుగుల పొడవు ఉన్న నాగరాజు నడి రోడ్డుపై పడగవిప్పి బుసలు కొడుతూ.. అటూ ఇటూ చూస్తూ అటుగా వెళ్ళే వారిని భయాందోళనకు గురిచేసింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 10నిముషాల పాటు రోడ్డుపై నిరీక్షించి, ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టించింది.
వర్షాకాలం ఆరంభం కావటంతో పొదల్లో వుండే పాములు ఇలా రోడ్డుపైకి వచ్చేసరికి జనాలు హడలిపోయారు. జనాలను చూసిన నాగుపాము తర్వాత కాసేపటికి భయంతో పక్కనే వున్న తోటల్లోకి నెమ్మదిగా జారిపోయింది. దీంతో అంతవరకు రోడ్డుకు రెండువైపుల ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము వెళ్లిపోవడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..