Visakhapatnam Licence Cancel Without Helmet: విశాఖపట్నంలో హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు జాగ్రత్త. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 53 వేల లైసెన్సులు రద్దు చేసినట్లు చెబుతున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మొదటిసారి పట్టుబడితే జరిమానా, మళ్లీ పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. విశాఖవాసులు అలర్ట్‌గా ఉండాలి.
హైలైట్:
- విశాఖపట్నంవాసులకు ముఖ్య గమనిక
- ఆ తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు
- జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు

హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తారు.. ఒకవేళ మళ్లీ దొరికితే మూడు నెలలు లైసెన్స్ రద్దు అవుతుంది. రెండోసారి దొరికితే ఆరు నెలల పాటూ లైసెన్స్ రద్దు చేస్తారు. మూడోసారి కోర్టు ఆదేశిస్తే శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ లైసెన్స్ రద్దు చేసిన సమయంలో వాహనం కనుక నడిపితే రూ.5 వేలు జరిమానాతో పాటుగా అదనంగా మరో మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు. కాబట్టి వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ లైసెన్స్ రద్దు ప్రతిపాదనలు రవాణాశాఖకు వెళుతున్నాయి. ఒకవేళ లైసెన్స్ రద్దు చేస్తే వాహనదారుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
Vizag Ayodhya Ram Mandir : వైజాగ్‌లో అయోధ్య రామమందిరం పేరిట దోపిడి.. నిర్వాహకుల అరెస్ట్
అంతేకాదు సస్పెన్షన్ గడువు ముగిసిన వెంటనే లైసెన్స్ ఆటోమేటిక్‌గా పునరుద్ధరణ చేస్తారు. లైసెన్స్ సస్పెండ్ అయిన సమయంలో ఎట్టిపరిస్థితుల్లో వాహనం నడపకూడదు. లైసెన్స్ రద్దుకు పావుగంట వరకు సమయం పట్టడం, తగిన సిబ్బంది లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆలస్యం జరుగుతోంది అంటున్నారు. విశాఖపట్నంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.. వాటిలో బైక్‌లపై వెళ్లేవారు ఎక్కువగా చనిపోతున్నారు. అందుకే పోలీసులు సీరియస్‌గా తీసుకుని.. తనిఖీలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.