ఆ రిపోర్ట్‌లోని డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్ నుంచి! వరస ప్లాఫుల్లో ఉన్న విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చాలా కష్టపడి మనసుపెట్టి చేసిన సినిమా కింగ్డమ్. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈసినిమా ఎట్ ప్రజెంట్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సెకండాఫ్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ ఓపెనింగ్స్ మాత్రం సూపర్భ్ గా ఉన్నాయంటూ.. సక్సెస్ మీట్‌లో చెప్పిన ప్రొడ్యూసర్ నాగవంశీ మాటలు.. ఓ నెట్టింట నెట్టింట వైరల్ అవుతున్న క్రమంలోనే.. కింగ్డమ్ మేకర్స్ నుంచి అఫీషియల్‌గా కలెక్షన్స్ అప్డేట్ బయటికి వచ్చింది. నాన్ హాలీడే.. అంటే జులై 31 గురువారం.. కింగ్డమ్ సినిమా రిలీజ్ అయినప్పటికీ… వరల్డ్ వైడ్ దాదాపు 39 క్రోర్ గ్రాస్ వసూళు అయినట్టు అఫీషియల్‌గా డిక్లేర్ చేసింది ఈ మూవీ టీం. అంతేకాదు క్రౌన్ పెట్టుకుని కూర్చున్న విజయ్ దేవరకొండాస్ స్పెషల్ కింగ్డమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడీ కలెక్షన్స్ ఫిగర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఇప్పటి వరకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ మరే సినిమాకు లేకపోవడంతో… విజయ్ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా కింగ్డమ్ మూవీ హిస్టరీ కెక్కనుంది. అంతేకాదు ఇదే జోరును ఈ సండే వరకు సస్టేన్ చేస్తే.. కింగ్డమ్ 50 కోట్లు క్రాస్ చేయడం పక్కా అనే కామెంట్ కూడా ఇప్పుడు ఫిల్మ్ అనలిస్టుల నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది