ఆగస్ట్ 2025 లో శుక్రుడు బుధుడు సూర్యుడు రాశిమారుతున్నారు. ఆగస్టులో లక్ష్మీనారాయణ యోగం శుభ ప్రభావం ఉంటుంది. దీని ఫలితంగా వృషభ రాశి వారికి అదృష్టం కలసి రావచ్చు అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. వీరికి ఆస్తి లావాదేవీలు కలిసొస్తాయని చెబుతున్నారు. స్థరాస్తి వ్యాపారం చేసేవారికి లాభం వస్తుందని సూచిస్తున్నారు. వృషభరాశివారు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా అవకాశాలు నెల మధ్యలో కలిసి వస్తాయని అంటున్నారు.
ఆగస్టు 2025 నెలలో వృషభ రాశి వారి వివాహ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. వివాహ జీవితంలో ఏదైనా విషయం గురించి వివాదం తలెత్తితే పరిష్కారం లభించేందుకు అనువైన సమయం వచ్చేసిందని చెబుతున్నారు. ఆ దిశగా తమ ప్రయత్నాలు సాగిస్తే ఆశించిన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
ఇక, ఉద్యోగస్తుల విషయానికి వస్తే.. పనిలో సీనియర్లు , జూనియర్ల సహకారం లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు అంటున్నారు. కుటుంబంలో కలహాలు, బంధువుల అపార్థాలు తొలగిపోతాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
Note : ఈ వార్తలో చెప్పిన సమాచారం కేవలం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..