Sai Sudharsan : ప్రస్తుతం ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం, వాదనలు సర్వసాధారణంగా మారాయి. రెండో రోజు ఆటలో కూడా అదే పరిస్థితి కనిపించింది. సాయి సుదర్శన్, బెన్ డకెట్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ తర్వాత మ్యాచ్ లో మరింత ఉద్రిక్తతను పెంచింది.
రెండో రోజు ఆట ముగింపులో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాయి సుదర్శన్ అవుట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు, డకెట్ ఏదో అనడంతో ఈ గొడవ మొదలైంది. ఓవల్ టెస్ట్ రెండో రోజు ఆట చివరి సెషన్‌లో, భారత రెండో ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 18వ ఓవర్‌లో, గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ను ఎల్బీడబ్ల్యూగా అంపైర్ అవుట్ ఇచ్చాడు.
సుదర్శన్ డీఆర్‌ఎస్ తీసుకున్నప్పటికీ, మూడో అంపైర్ కూడా అవుట్ అని నిర్ధారించాడు. దీంతో సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ వైపు నడుస్తున్నాడు. అదే సమయంలో, ఫీల్డింగ్ చేస్తున్న బెన్ డకెట్ సాయి సుదర్శన్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. ఆ మాటలు విని సుదర్శన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, డకెట్‌కు గట్టిగా బదులిచ్చాడు. ఆ తర్వాతే అతను పెవిలియన్‌కు వెళ్లాడు. వారి మధ్య సంభాషణ ఏమిటనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సంఘటన మ్యాచ్‌లో ఉద్రిక్తతను మరింత పెంచింది. రెండో రోజు ఆటలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చాలా వాదనలు జరిగాయి.
Some Heated words exchange with Ben Ducket and Sai Sudarshan, c’mon Sai perform and then speak.#INDvsENG #Saisudarshan #BenDuckett pic.twitter.com/OifqJhFxeL
— Pawan Mathur (@ImMathur03) August 1, 2025
ఓవల్ టెస్ట్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారతీయ బౌలర్లలో సిరాజ్ 19వవాడు. ఓవల్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి, భారత జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి, ఇంగ్లండ్‌పై 52 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి, 49 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతనితో పాటు నైట్‌వాచ్‌మెన్ ఆకాశ్‌దీప్ సింగ్ క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఆటలో జట్టును ముందుకు నడిపించే భారీ బాధ్యత ఇప్పుడు యశస్వి జైస్వాల్‌పై ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..