పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. పక్కా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఉన్న ఆ కుర్రాడు.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. ? ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అతడు మరెవరో కాదు.. హీరో నారా రోహిత్.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి
నారా రోహిత్.. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడి కుమారుడు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన రోహిత్.. రాజకీయాల్లోకి కాకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఫస్ట్ మూవీతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు. కానీ ఆ తర్వాత హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగులో సోలో, ప్రతినిధి వంటి చిత్రాలతో అలరించారు.
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..
అయితే ఇప్పటివరకు రోహిత్ కు సరైన బ్రేక్ రాలేదు. ఇటీవలే భైరవం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే హీరోయిన్ సిరి లెల్లాతో నిశ్చితార్థం చేసుకున్నారు రోహిత్. కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..