NTR Vaidya Seva Trust Aarogyasri Process: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ (ఆరోగ్య శ్రీ)ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరికి కార్డు లేకపోవడం వల్ల వైద్యం విషయంలో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతితో వైద్యం అందిస్తారు. ఏపీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అర్హత ఉంటే చాలు.. ఆరోగ్య శ్రీ కార్డు లేదనే టెన్షన్ అవసరం లేదు.
హైలైట్:
- ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక
- ఆ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ
- CMO అనుమతితో వైద్యం

ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైన పథకం. దీని ద్వారా పేద ప్రజలకు మంచి వైద్యం అందుతుంది. పుట్టుకతో వచ్చే చెవుడు, మూగ సమస్యలకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. క్యాన్సర్ వ్యాధికి కూడా ఉచితంగా అది కూడా అపరిమితంగా వైద్యం అందిస్తున్నారు. ఈ కార్డు ఉంటే చాలా వరకు వైద్య ఖర్చుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ‘రూ.వెయ్యి దాటితే ఈహెచ్‌ఎస్‌లో 836, ఆరోగ్యశ్రీలో 3,257 రోగాలకు ఉచిత వైద్యం వర్తిస్తుంది.12 ఎకరాల లోపు మాగాణి భూమి, 35 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. మాగాణి, మెట్ట కలిపి 35 ఎకరాల లోపు ఉన్నా కూడా అర్హులే. శాశ్వత ఉద్యోగులు, పెన్షనర్లు కాకుండా రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఇతర ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. కుటుంబానికి ఒక కారు ఉన్నా సమస్య లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేన్ల పరిధిలో 3వేల చదరపు అడుగుల కంటే తక్కువ ఆస్తి పన్ను చెల్లించే వారు కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు’ అని అధికారులు తెలిపారు.
ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..
ట్రస్ట్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల వ్యవస్థ రోగులకు ఉచిత సేవలు అందిస్తుంది. ఆరోగ్యమిత్రలు ఉచితంగా సేవలు అందిస్తారు. డిశ్చార్జ్ అయ్యాక రవాణా ఛార్జీలు కూడా ఇస్తారు. రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ఐవీఆర్‌ఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయొచ్చు. డబ్బులు ఎక్కువగా తీసుకుంటే ఫిర్యాదు చేయడానికి 104, 14400 టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి. అలాగే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కార్డులు ఉన్నవాళ్లకి దేశంలో ఎక్కడైనా.. PMJAY ఒప్పందం ఉన్న ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చు.