రాఖీ పౌర్ణమి అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య ప్రేమకు చిహ్నం. ప్రతి సంవత్సరం ఈ పండుగను శ్రావణ మాసం పూర్ణిమ రోజున జరుపుకుంటారు. రక్షా బంధన్ అంటే సోదరీమణులు ప్రేమ , ఆప్యాయతతో తయారు చేసిన దారాన్ని తమ సోదరుడి మణికట్టుకి కట్టే పండుగ.
తమ సోదరి రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని ఎప్పుడు ఎన్ని రోజుల తీయాలనే విషయం చాలా మందికి తెలియదు. కొంతమంది రాఖీ కట్టిన రోజున లేదా మర్నాడు దానిని చేతి నుంచి తీసేస్తారు. అయితే కొంతమంది
రోజుల తరబడి రాఖీని ధరిస్తూ ఉంటారు
రాఖీ పండగ రోజున రాఖీని కట్టిన తర్వాత ఆ రోజు సాయత్రం లోపు రాఖీని తీసివేయవచ్చు. ఇలా రాఖీ కట్టిన రోజునే రాఖీని తీసివేస్తే.. అది శుభప్రదంగా పరిగణించబడుతుంది,
రక్షాబంధన్ రోజున కట్టిన రాఖీని జన్మాష్టమి రోజున తీసివేయవచ్చు. రాఖీ పండగ ముగిన 6, 7 రోజుల తర్వాత శ్రీ కృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఈ రోజున సోదరుడు తన చేతి నుంచి రాఖీని తీసి దానిని మొక్కకు కట్టవచ్చు.
రాఖీని ఎప్పుడు తీసివేయాలనే విషయం శాస్త్రాలలో ప్రస్తావించబడలేదు. దీనికి ఒక నిర్దిష్టమైన రోజు ప్రస్తావించబడలేదు. అయితే రాఖీని చాలా రోజులు కట్టుకుని ఉండడం అశుభం. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాఖీ చేతి నుంచి పడిపోతే.. దానిని తొక్కడం అశుభం అని భావిస్తారు.
అంతేకాదు ఇంట్లో విరిగిన లేదా అపరిశుభ్రమైన వస్తువులు ఉండడం జీవితంలో ప్రతికూలతను సృష్టిస్తాయని నమ్మకం. కనుక రాఖీని అదే రోజున లేదా శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుంచి తీసి మొక్కకు కట్టడం శుభప్రదం అని పెద్దలు చెబుతున్నారు.