
బలహీనమైన మడమలు మంట, నొప్పిని కలిగిస్తాయి. పగిలిన మడమలను తగ్గించడానికి చాలా మంది వివిధ రకాల క్రీమ్‌లు మరియు మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది మడమల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో తేమ కారణంగా మడమల పగుళ్ల సమస్య తీవ్రమవుతుంది. కొన్నిసార్లు ఈ సమస్య దానికదే నయమవుతుంది. అయితే, కొద్ది కాలంలో అదే సమస్య మళ్లీ మొదలవుతుంది. పగిలిన మడమలను నయం చేయడానికి మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా ఖరీదైనవి. అంతేకాకుండా వీటిలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని ఇంటి నివారణలు పగిలిన మడమలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందులో పటిక చిట్కా ఒకటి. పటికను పగిలిన మడమలకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పగిలిన మడమల సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? ఈ సహజమైన పటిక చిట్కాలతో మీ పాదాలను మృదువుగా, అందంగా మార్చుకోండి.
పటికతో చర్మానికి ప్రయోజనాలు:
ఆయుర్వేదంలో పటికకు విశేష ప్రాధాన్యత ఉంది. శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్న పటిక చర్మాన్ని మృదువుగా చేయడానికి, ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. పటికలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ గుణాలు పాదాల దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా పాదాల్లో నొప్పి, వాపు నుంచి ఉపశమనం అందించడంలో కూడా పటిక తోడ్పడుతుంది.
పగిలిన మడమల కోసం పటిక చిట్కా:
మడమలను జాగ్రత్తగా చూసుకోకపోతే పగుళ్లు పెద్దవిగా మారి రక్తం కూడా బయటకు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో పటిక ఒక చక్కటి పరిష్కారం. ఇందుకోసం ముందుగా నీటిని వేడి చేయండి. ఒక గిన్నెలో పటికను తీసుకుని, వేడి నీటి గిన్నె మధ్యలో ఉంచండి. కొంత సమయం తర్వాత పటిక పూర్తిగా కరిగిపోతుంది. కరిగిన పటిక ద్రావణంలో కొద్దిగా కొబ్బరి నూనె కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పగిలిన మడమల మీద అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల పగిలిన మడమలు పూర్తిగా నయమవుతాయి.
ముందు చేయాల్సిన పని:
ఈ చిట్కా పాటించే ముందు పాదాలను బాగా శుభ్రం చేసుకోండి. గోరువెచ్చని నీరు, సబ్బుతో పాదాలను క్లీన్ చేయండి. తరువాత, పాదాలను 10 నుంచి 12 నిమిషాలు గోరువెచ్చని నీటిలో ముంచి ఉంచండి. ఆ తర్వాత పాదాలను నీటి నుంచి తీసి, టోనర్ సహాయంతో క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత పటిక చిట్కా అప్లై చేయడం వల్ల పగిలిన మడమలు నయమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా కూడా వాడవచ్చు:
పగిలిన మడమల కోసం పటికను ఇంకో రకంగా కూడా వాడవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ముందుగా పటికను తీసుకుని పొడి చేయండి. ఇప్పుడు దానికి నిమ్మరసం జోడించి పేస్ట్ సిద్ధం చేయండి. ఈ పేస్ట్‌ను మీ పగిలిన మడమల మీద అప్లై చేసి కొంత సమయం అలాగే ఉంచండి. ఆ తర్వాత స్క్రబ్బర్ సహాయంతో మడమలను శుభ్రం చేయండి. ఈ ఇంటి నివారణను కొన్ని రోజులు పాటించడం వల్ల పగిలిన మడమలు నయం అవుతాయి.
పటిక చిట్కా తర్వాత గ్లిజరిన్:
పటిక చిట్కా అప్లై చేసిన తర్వాత, పగిలిన మడమలపై గ్లిజరిన్ అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది మడమలు మళ్లీ పగుళ్లు రాకుండా నిరోధిస్తుంది. పటిక పగిలిన మడమలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో అనేక క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇవి చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో, ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడతాయి. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల మడమలు మృదువుగా, శుభ్రంగా ఉంటాయి. ఈ నివారణ పూర్తిగా సహజమైంది,