ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు.. పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నగదును విడుదల చేశారు. కాగా.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వారణాసిలో వరద పొటెత్తింది.. గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో వారణాసిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.. ఈ నేపథ్యంలో వారణాసిలో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ అధికారులతో స్వయంగా మాట్లాడారు.. వారణాసి వరద పరిస్థితి గురించి డివిజనల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆయనకు వివరించారు. వరద బాధితులకు సహాయం చేయడానికి జరుగుతున్న చర్యల గురించి కూడా ఆయన చర్చించారు. సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలు, వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందిన వారి కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా ప్రధాని మోదీకి వివరించారు. స్థానిక పరిపాలన ద్వారా బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని, చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో 51వ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ వారణాసి ప్రజలను సహాయక చర్యలకు సిద్ధం కావాలని ఆదేశించారు. వరద బాధితులకు సహాయ శిబిరాల్లో, వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్న వారికి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రజలకు స్థానిక పరిపాలన నుండి అన్ని విధాలా మద్దతు లభించాలని ఆయన నొక్కి చెప్పారు.
Uttar Pradesh | Prime Minister Narendra Modi enquired about the flood situation in Varanasi from the Divisional Commissioner and District Magistrate of Varanasi. He also sought information about the preparedness as well as the relief operations to assist people.
PM Modi also… pic.twitter.com/hN9cY2Jypf
— ANI (@ANI) August 2, 2025
భారీ వర్షాల కారణంగా వారణాసి వరదల బారిన పడింది. ఈ ఉదయం గంగా నది నీటి మట్టం పెరగడంతో వారణాసి నగరంలోని అనేక ప్రాంతాలకు వరద నీరు చేరింది. ఆగస్టు 2 నుండి 4 వరకు వారణాసికి భారత వాతావరణ శాఖ (IMD) యెల్లో అలర్ట్ జారీ చేసింది.
River Ganges at Varanasi 🙏🏻
Floodwaters from the rising Ganga River have inundated several areas of Varanasi city.
Flood mainly coming from Yamuna and its southern tributaries Chambal, Betwa, Sindh and Ken rivers Originates in Madhya Pradesh and Rajasthan.
Forwarded Video. pic.twitter.com/01DVi9wVav
— Naveen Reddy (@navin_ankampali) August 2, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతను విడుదల చేశారు. 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.20,500 కోట్లకు పైగా బదిలీ చేశారు. 20వ విడతతో, ఈ పథకం ప్రారంభం నుండి మొత్తం చెల్లింపు రూ.3.90 లక్షల కోట్లు దాటింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
భారీగా కురుస్తున్న వర్షాలతో వరుణ నది ఒడ్డున ఉన్న 10 ప్రాంతాలలోకి, గంగా నది ఒడ్డున ఉన్న 15 గ్రామాలలోకి నీరు ప్రవేశించింది. వందలాది ఎకరాల పంటలు మునిగిపోయాయి. మణికర్ణిక ఘాట్ వద్ద, సాతువా బాబా ఆశ్రమం గేటు దగ్గర వరద ప్రవాహం పోటెత్తింది.. ఇక్కడి నుండి, పడవలలో దహన సంస్కారాల కోసం మృతదేహాలను తీసుకెళ్తున్నారు. దీని కోసం, ప్రజలు 6 నుండి 8 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. పలు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..