ఆమె అడగ్గానే ఫోన్ పేలో మొదట 50 వేల రూపాయలు పంపించాడు బాధితుడు. పలు దఫాలుగా మొత్తం 14లక్షల 95వేల135 రూపాయలు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేశారు. అతని ఖాతాలో 59 వేల 93 డాలర్స్ క్రెడిట్ అయినట్టు ఆమె చూపించింది. ఆ మొత్తాన్ని తన ఖాతాకు జమ చేయమని అతను కోరాడు. సదరు ఖాతా ఫ్రీజ్ అయిందని ఆమె నమ్మించేందుకు ప్రయత్నించింది. మరో 20 లక్షల రూపాయలు చెల్లించమని డిమాండ్ చేసింది. అనంతరం అతని నెంబరును ఆమె బ్లాక్ చేసింది. దీంతో మోసపోయినట్టు గుర్తించిన యువకుడు పోలీసులను ఆశ్రయించారు. మరో 20 లక్షలకు మహిళ టోకరా వేయబోవడంతో మేలుకున్న బాధితుడు మోసపోయానని గుర్తించి రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. తనకు నమ్మకం వచ్చేలా తన ఫోటోలు అంటూ పంపి బాధితుడిని ముంచేసింది.. డాలర్ రూపంలో పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభాలు వస్తే, స్థిరపడతామన్న ఆలోచనతో అమౌంట్ వేసానని, ఇదంతా మోసమని గ్రహించలేకపోనని బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను, రాజానగరం పోలీసులను అశ్రయించానని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కూడా తన బాధను మెయిల్ ద్వారా తెలియజేశానని బాధితుడు వెల్లడించాడు.
మరిన్ని వీడియోల కోసం :
నీ కష్టం పగోడికి కూడా రావద్దు బ్రో .. వైరల్ అవుతున్న వీడియో
ఇదెక్కడి ఆచారం.. ఆ దుమ్ము,ధూళితో రోగాలన్నీ మాయం వీడియో
రేయ్ ఎంత పని చేసార్రా.. గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెనా? వీడియో