జపాన్ లో తెలుగు సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. అలాగే మన హీరోలకు అక్కడ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో జపాన్ లో విడుదలైన ముత్తు సినిమాతో అక్కడ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక కొన్నాళ్లుగా బాహుబలి సినిమాతో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం జపనీయులకు ఇష్టమైన హీరోలుగా మారారు. ఇటీవల దేవర సినిమా ప్రమోషన్లలో భాగంగా జపాన్ లో సందడి చేశారు తారక్. వీళ్లే కాకుండా టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు సైతం ఆ దేశంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ మనం. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంత, దివంగత నటుడు నాగేశ్వరరావు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ సినిమా 2014లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను జపాన్ లో రీరిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 8న ఈ చిత్రాన్ని జపాన్ లో మరోసారి విడుదల చేయనున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున యాక్టింగ్ కు ఫిదా అయ్యారు జపనీయులు. దీంతో నాగార్జుకు డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఇప్పుడు మనం సినిమా రీరిలీజ్ కోసం నాగార్జున జపాన్ అభిమానులతో ముచ్చటించనున్నారు.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
ఇవి కూడా చదవండి
మనం రీరిలీజ్ సందర్భంగా తనపై ఇంతగా ప్రేమ, ఆదరణ చూపిస్తున్న అభిమానులతో నాగార్జున సమావేశం కానున్నాయి. అయితే నేరుగా కాదు.. మనం సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులతో నాగార్జున వీడియో కాల్ ద్వారా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జపాన్ సినీప్రియులకు అది ఒక మెమరబుల్ మూమెంట్ కానుంది.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..