Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

2 August 2025

Pani puri: పానీ పూరీ లవర్స్ మీరైతే.. స్పైసీ గొల్గప్పాలను ఇంట్లోనే చేసుకోండి.. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి.. రెసిపీ

2 August 2025

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌ రెడ్డి! బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ..

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»అనిల్ కుమార్ యాదవ్,YSRCP: అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా.. వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు.! – former minister anil kumar yadav challenges he will donate all his property to amaravati if the allegations are proved
ఆంధ్రప్రదేశ్

అనిల్ కుమార్ యాదవ్,YSRCP: అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా.. వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు.! – former minister anil kumar yadav challenges he will donate all his property to amaravati if the allegations are proved

.By .2 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అనిల్ కుమార్ యాదవ్,YSRCP: అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా.. వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు.! – former minister anil kumar yadav challenges he will donate all his property to amaravati if the allegations are proved
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వేయికోట్లు ఆస్తి కూడబెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై సిట్టింగ్ జడ్డితో విచారణకు సిద్ధమని.. నిజమని తేలితే ఆ ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ చేశారు.

అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా.. వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు.!
అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా.. వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు.! (ఫోటోలు– Samayam Telugu)

వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులను అమరావతికి రాసిచ్చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరా నేతా… ఎందుకా మాటన్నారనే సంగతికి వస్తే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దూకుడైన మాటతీరుతో అనిల్ కుమార్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అనిల్ కుమార్ యాదవ్.. ఈ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. కావాలంటే సీఎం చంద్రబాబు సిట్ దర్యాప్తునకు ఆదేశించవచ్చని అన్నారు. వేయి కోట్లు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని. గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా సరే.. అమరావతికి రాసిస్తానని సవాల్ చేశారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేయిస్తోందని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారం కేసులు పెట్టి వేధిస్తున్నారని.. విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి అక్రమాస్తులను కూడబెట్టుకోలేదని.. ఆఫ్రికాలో తనకు మైనింగ్స్ ఉన్నాయనేది అబద్ధపు ప్రచారమని కొట్టిపారేశారు. తనపై చేస్తున్న ఆరోపణల మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. 2008 కంటే ముందు ఉన్న ఆస్తులు.. ఇప్పుడు ఉన్న ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తన వద్ద వేలకోట్లు ఉన్నాయని నిరూపించిన పక్షంలో.. ఆ ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీ ఇష్టం.. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా: మాజీ మంత్రి అనిల్

మరోవైపు తనకు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి గతంలో మనస్ఫర్ధలు ఉండేవని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. తామిద్దరం కలిసి మైనింగ్ వ్యాపారం చేసినట్లు వాంగ్మూలంలో రాశారని.. మనస్పర్థలు ఉంటే ఎలా కలిసి వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. ఇక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు అవుతానని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆగస్ట్ నాలుగో తేదీ విచారణకు హాజరవుతానని… జైలుకు పంపాలని వారు నిర్ణయించుకున్నా తాను సిద్ధమంటూ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి