గరిక గడ్డి గురించి తెలియని వారు ఉండరు. దీని శాస్ట్రీయ నామం సైనోడాన్ డాక్టిలాన్. దీనిని దూర్వా గడ్డి అని కూడా అంటారు. వినాయకుడికి నైవేథ్యంగా సమర్పించే ఈ గరిక గడ్డి.. పూజకి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దూర్వా గడ్డి రసం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి భలేగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇటీవల కాలంలో పలు రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వీటి నుంచి రక్షణ పొందడానికి గరికలోని ఔషధ గుణాలు ఎంతో సహకరిస్తాయి. గరిక గడ్డి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
గరిక గడ్డి ఎందుకు మంచిది?
ఆయుర్వేదంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి దూర్వా లేదా గరిక గడ్డిని ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి రక్తస్రావం తగ్గించడం, గాయాలను నయం చేయడం వరకు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. అంతే కాదు జ్వరం వంటి సమస్యలను నయం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
గరిక గడ్డి జ్యూస్ ఉపయోగాలు
గరిక గడ్డి రసం లేదా కషాయాన్ని వారానికి ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా క్రమంగా నివారించవచ్చు. ఈ రసం తాగడం వల్ల రక్తంలో క్యాన్సర్ కణాల సంఖ్య తగ్గుతుందట. అంతేకాదు, రక్తం కూడా శుద్ధి అవుతుంది. గరికె గడ్డిలో విటమిన్లు ఎ, కె, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తపోటు, రక్తహీనత, రక్త సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
గరిక మొక్కలోని ఔషధ గుణాలు
- సాధారణంగా ఈ మొక్కలోని అన్ని భాగాలు.. వేర్లు, ఆకులు సహా అన్నింటిలో ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి. దీనికి వ్యాక్సినియా వైరస్ అనే కొన్ని హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేసే గుణం ఉంది. అందువల్ల, ఈ మొక్క రసం తాగేవారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
- ఈ రసం మూత్రాశయంలో రాళ్లు, శరీరం వాపు, పిల్లలలో దీర్ఘకాలిక జలుబు, ముక్కు కారటం, విరేచనాలు, కంటి లోపాలు, మెదడులో రక్తస్రావం వంటి వ్యాధులను నివారిస్తుంది.
- బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, న్యూరోపతి, రక్త క్యాన్సర్, దగ్గు, కడుపు నొప్పి, రక్తహీనత, ఆర్థరైటిస్, గుండె రుగ్మతలు, చర్మ వ్యాధులు మొదలైన వాటిని నయం చేయడంలో ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
- గరిక రసం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో, రక్తం నుంచి విషాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
- గరిక రసం, కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో కలిపి, మరిగించి.. రింగ్‌వార్మ్, పొడి చర్మం వంటి చర్మ సమస్యలు ఉన్నచోట పూయడం వల్ల శీఘ్ర ఫలితాలు లభిస్తాయి.
- గరికె గడ్డికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్ లా చేసి శరీరంపై అప్లై చేసి, గంటసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత స్నానం చేస్తే శరీరం దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.