తేనె సహజంగా లభించే తీపి పదార్థం. ఇది పోషకాలతో కూడిన ఆయుర్వేద ఔషధం కూడా. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ డయాబెటిస్ ఉన్నవారు తేనెను చక్కెరకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చా ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి.. తేనెలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే డయాబెటిక్ రోగులు అధిక పోషక విలువలు కలిగిన తేనెను తీసుకుంటే ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
తేనెను చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చా?
మధుమేహం ఉన్నవారు తేనెను చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు. తేనెలో చక్కెర కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు, కేలరీలు, తీపి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. కాబట్టి దీనిని చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం మంచిది కాదు. కానీ తేనె తినాలనుకుంటే, చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. తేనెలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అందువల్ల నిపుణులు డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తేనెను తక్కువ పరిమాణంలో తీసుకోవాలని చెబుతున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు తేనె ఎందుకు మంచిది కాదంటే..
తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నప్పటికీ, అది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో 17 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తేనెను ఇతర కార్బోహైడ్రేట్లతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. WHO ప్రకారం.. ఒక టీస్పూన్ తేనెలో దాదాపు 64 కేలరీలు, 17 గ్రాముల చక్కెర, 17 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.06 గ్రాముల ప్రోటీన్, 0.04 గ్రాముల ఫైబర్ ఉంటాయి. తేనెలో పొటాషియం, కాల్షియం, జింక్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తులకు, తేనె తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డయాబెటిక్ రోగులు తేనెకు దూరంగా ఉండాలి. ఇది చక్కెర మాదిరిగానే రక్తంలో షుగర్ లెవెల్స్‌ను వేగంగా ప్రభావితం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
డయాబెటిస్ ఉన్న రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచే ఆహారాలు, చక్కెర పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం కూడా చేయాలి. సమయానికి నిద్రపోవాలి. వైద్యులు సూచించిన మందులను సమయానికి తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ప్రతిరోజూ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.