పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. డాక్టర్లు సైతం డైలీ పాలు తాగమని చెబుతారు. అయితే కొంతమంది పాలతో పండ్లను తినడానికి ఇష్టపడతారు. కానీ పాలతో కొన్ని పండ్లను తినడం శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా.? అది మీ ఆరోగ్యానికి మేలు చేసే బదులు మీకు హాని కలిగిస్తుంది. పొరపాటున పాలతో తినకూడని 5 పండ్లు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పుల్లని పండ్లు
పాలు – పుల్లని పండ్లను కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం. ఉసిరి, నిమ్మ, నారింజ వంటి పండ్లను పాలతో తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం.. పుల్లని పండ్లలో ఉండే ఆమ్లం పాలతో కలిపినప్పుడు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
పాలు -పైనాపిల్
పాలు – పైనాపిల్ కలిపి తినకూడదు. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పాలతో కలిసినప్పుడు వాటిని పెరుగుగా మారుస్తుంది. కలిపి తిన్నప్పుడు కొంతమందికి జీర్ణ సమస్యలు రావచ్చు. అటువంటి పరిస్థితిలో పాలతో పైనాపిల్ తినడం మానుకోవాలి.
దానిమ్మ -పాలు
దానిమ్మ, పాలు కలిపి తీసుకోకూడదు. రెండూ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దానిమ్మ తిన్న తర్వాత పాలు తాగాలనుకుంటే.. అరగంట ఆగి తాగండి. దానివల్ల దానిమ్మ జీర్ణమయ్యే సమయం లభిస్తుంది.
పాలు – జామ
పాలు – జామ కలిపి తినకూడదు. ఇది ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది. జామలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పాలతో కలిపినప్పుడు ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కొంతమందిలో కడుపు నొప్పి, మలబద్ధకం లేదా ఇతర సమస్యలు రావచ్చు.
బొప్పాయి -పాలు
బొప్పాయి, పాలు సాధారణంగా కలిపి తినకూడదు. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ పాలతో చర్య జరపడం వల్ల జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ రెండింటినీ తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..