జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే జీలకర్ర నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా పరిగణిస్తారు. అందుకే దీనిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతుంటారు.
అంతేకాదు ప్రతి ఉదయం జీలకర్ర నీటిని నెల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటిస్తే నెల రోజుల్లోనే తేడాను గమనిస్తారు. ప్రతి ఉదయం జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా గ్యాస్, ఉబ్బరం, పేగు సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీలకర్ర నీరు అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలను తొలగించడంలో అమృతంలా పనిచేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఈ నీరు సహాయపడుతుంది. జీలకర్ర నీరు బరువును తగ్గించడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో బలేగా సహాయపడుతుంది. అయితే జీలకర్ర నీటిని ఒక నెల పాటు నిరంతరం తీసుకోవాలనే విషయం మర్చిపోకూడదు. జీలకర్ర నీరు జీవక్రియను పెంచడమే కాకుండా, దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.
జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి కాపాడతాయి. చర్మ కాంతిని పెంచుతాయి. ఇవి మొటిమలు, నల్ల మచ్చలను కూడా తగ్గిస్తాయి. జీలకర్ర నీరు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. జీలకర్ర నీరు శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు జీలకర్ర నీటిని తాగడం మరింత మంచిదని నిపుణులు అంటున్నారు. జీలకర్ర నీరు పీరియడ్స్ సమయంలో నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.