Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Chinnaswamy Stadium: బెంగళూరు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంపై నిషేధం..?

3 August 2025

చేసింది 4 సినిమాలు.. ఒక్క హిట్టు లేదు.. టాప్ క్రికెటర్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఈ బ్యూటీ ఎవరంటే..

3 August 2025

Earthquake: భారీ భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. భయంతో పరుగులు పెట్టిన జనం!

3 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Hyderabad Vijayawada Greenfield Expressway,విజయవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఇక రెండున్నర గంటల్లో వెళ్లిపోవచ్చు – nitin gadkari said will construct greenfield express highway between hyderabad and vijayawada
ఆంధ్రప్రదేశ్

Hyderabad Vijayawada Greenfield Expressway,విజయవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఇక రెండున్నర గంటల్లో వెళ్లిపోవచ్చు – nitin gadkari said will construct greenfield express highway between hyderabad and vijayawada

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Hyderabad Vijayawada Greenfield Expressway,విజయవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఇక రెండున్నర గంటల్లో వెళ్లిపోవచ్చు – nitin gadkari said will construct greenfield express highway between hyderabad and vijayawada
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విజయవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రూట్లో ప్రస్తుతం ఉన్న రహదారిని ఆరు లేన్లకు విస్తరించే పనులు జరుగుతున్నాయని.. ఇది పూర్తయితే ప్రయాణ సమయం రెండున్నర గంటలకు తగ్గుతుందని చెప్పుకొచ్చారు. అలానే ఏపీలో రూ.2.5 లక్షల కోట్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో ఏపీ రోడ్లు అమెరికాకు సమానంగా ఉంటాయని నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం..

హైలైట్:

  • విజయవాడ- హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే..
  • సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం
  • ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
విజవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
విజవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే (ఫోటోలు– Samayam Telugu)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారులు నిర్మాణానికి అధిక ప్రధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పారు. విజయవాడ- హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. నిర్మిస్తామని వెల్లడించారు. అలానే ప్రస్తుతం ఈ రెండు పట్టణాల మధ్య అనగా హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఇప్పుడున్న రోడ్డును ఆరు లేన్లకు విస్తరించే పనులు మొదలయ్యాయి అని తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం సగానికి సగం.. అనగా ఐదు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుందన్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా నితిన్ గడ్కరీ వెల్లడించారు.ఇప్పటికే ఏపీలో రూ.2.5 లక్షల కోట్ల రోడ్ల నిర్మాణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియక ముదే.. మరో లక్ష కోట్ల రూపాయల కొత్త పనులు ఆరంభిచబోతున్నాం అన్నారు. ఇవి పూర్తయితే.. రానున్న రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు.. అమెరికాకు సమానంగా ఉండబోతున్నాయి అని నితిన్ గడ్కరీ తెలిపారు.

మంగళగిరిలో శనివారం నిర్వహించిన జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లుగానే రాష్ట్ర అభివ‌ృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. నాయకత్వం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందడుగేస్తోందని తెలిపారు. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు దార్శనికత, ఆలోచనను అభినందిస్తున్నారు. విజన్ అంటే ఏంటో దేశానికి చూపించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు.
నీరు, కమ్యూనికేషన్, విద్యుత్తు, రవాణా వంటి రంగాల్లో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే.. మరికొన్ని సంవత్సరాల్లో.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1, రెండో స్థానాల్లో నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదన్నారు నితిన్ గడ్కరీ. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో మన దేశ రైతులు అన్నదాతలే కాదు ఇంధన దాతలు కూడా అయ్యారని చెప్పుకొచ్చారు. అలానే రానున్న రోజుల్లో రైతు బిటుమిన్‌ దాత కూడా కాబోతున్నారని తెలిపారు. ఇప్పటికే వరిగడ్డితో తయారు చేసే బిటుమిన్ ద్వారా నాగపూర్-జబల్పుర్‌ నేషనల్ హైవేలో కిలోమీటరు రహదారిని నిర్మించామని చెప్పుకొచ్చారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి