Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. ఆగస్ట్‌లో 15 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

3 August 2025

Chinnaswamy Stadium: బెంగళూరు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంపై నిషేధం..?

3 August 2025

చేసింది 4 సినిమాలు.. ఒక్క హిట్టు లేదు.. టాప్ క్రికెటర్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఈ బ్యూటీ ఎవరంటే..

3 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Naidu Dry Ports Andhra Pradesh,చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. రాష్ట్రంలో మరో 20 పోర్టులు – chandrababu naidu at mangalagiri programme said his govt will construct 2 dry ports in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Chandrababu Naidu Dry Ports Andhra Pradesh,చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. రాష్ట్రంలో మరో 20 పోర్టులు – chandrababu naidu at mangalagiri programme said his govt will construct 2 dry ports in andhra pradesh

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Naidu Dry Ports Andhra Pradesh,చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. రాష్ట్రంలో మరో 20 పోర్టులు – chandrababu naidu at mangalagiri programme said his govt will construct 2 dry ports in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌కు మరో 20 పోర్టులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో నదులు, కాలువలు ఎక్కువగా ఉండటంతో పోర్టుల నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చూస్తామని చెప్పుకొచ్చారు. అలానే త్వరలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మాణం, విశాఖ, విజయవాడకు మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. అంతేకాదు, బుల్లెట్ రైలు ప్రతిపాదనను కూడా మరోసారి తెరపైకి తెచ్చారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఏపీలో 20 పోర్టులు
ఏపీలో 20 పోర్టులు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో మరో 20 పోర్టులు నిర్మించబోతున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తాజాగా శనివారం నాడు మంగళగిరిలో వర్చువల్‌గా నిర్వహించిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదులు, కాలువలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందుకే రాష్ట్రాంలో మరిన్ని పోర్టులు నిర్మిస్తామని అన్నారు. ఏపీకి ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్‌లను తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో 20 పోర్టులను తయారు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలానే ప్రస్తుతం ఏపీలో 7 విమానాశ్రయాలు ఉన్నాయని.. భోగాపురం వచ్చే ఆగస్టు నాటికి ప్రారంభమవుతుందని తెలిపారు. గంటలో విమానాశ్రయానికి, పోర్టుకు వెళ్లే రోడ్‌ నెట్‌వర్క్‌ ఉంటే ఏపీ లాజిస్టిక్‌ హబ్‌గా మారుతుందని తెలిపారు

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందించిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. పొలంలోనే గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని గడ్కరీ ఎప్పుడూ చెబుతుంటారు అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇక గడ్కరీ హయాంలోనే దేశంలో సాగర్ మాల, భారత్ మాల వంటి పథకాలు వచ్చాయని చంద్రబాబు ప్రశంసించారు.
అమరావతిలో 189 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలానే విశాఖ, విజయవాడకు మెట్రో రైలు సౌకర్యం కూడా కావాలని అడిగానని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుండటంతో ఏపీలో ప్రపంచంలోనే అత్యుత్తమ రోడ్లు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం చొరవ చూపిస్తుండటం వల్లే ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ మెరుగుపడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అలానే ఏపీకి బుల్లెట్ రైలు ప్రతిపాదనను మరో సారి తెర మీదకు తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఢిల్లీ పర్యటన సందర్బంగా చంద్రబాబు ఏపీకి బుల్లెట్ రైలు ప్రతిపాదన చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన చంద్రబాబు.. దక్షిణ భారతదేశంలో పెద్ద నగరాలైన హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరుల మీదుగా బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని సూచించారు. తాజాగా శనివారం నాడు కూడా మరోసారి ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. నితిన్ గడ్కరీ ఏపీ పర్యటన సందర్భంగా చంద్రబాబు మరోసారి ఈ ప్రతిపాదన చేశారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి