మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకీ హైప్ పెరుగుతుంది. ఇందులో చరణ్ పూర్తిగా రగ్గడ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకోసం హైదరాబాద్ శివారులో వేసిన ఓ భారీ సెట్ లో సీన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన చరణ్ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..
పెద్ది చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని.. చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఓ ఫోక్ సాంగ్ రీమిక్స్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం.. మా ఊరి ప్రెసిడెంట్ అనే జానపద పాటను రీమిక్స్ చేస్తున్నారని.. ఈ పాటను సింగర్ పెంచల్ దాస్ ఆలపించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఏ.ఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ టచ్ ఇచ్చారని టాక్.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..
ఇక ఈ స్పెషల్ పాటలో రామ్ చరణ్ సరసన కిస్సిక్ బ్యూటీ శ్రీలీల ఆడిపాడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన శ్రీలీల.. ఇటీవలే జూనియర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పుష్ప 2 చిత్రంలో ఆమె చేసిన కిస్సిక్ పాట ఎంత పెద్ద హిట్టు అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు చరణ్ సరసన ఫోక్ పాటతో రచ్చ చేయనుంది. దీంతో ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

Sreeleela
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..