Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే..

3 August 2025

Kakinada: నైట్ డ్యూటీకి వెళ్లిన భర్త.. వచ్చి చూసేసరికి రక్తమడుగులో భార్య, ఇద్దరు పిల్లలు..!

3 August 2025

Watch: మెట్రోలో ప్రయాణించిన హాలీవుడ్‌ నటుడు..మహిళా ప్రయాణికురాలి పట్ల రియల్‌ హీరో అయ్యాడు..

3 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nh 65 Widening At Punnami Ghat,ట్రాఫిక్ సమస్యలకు చెక్.. పున్నమి ఘాట్ వరకు ఎన్‌హెచ్ 65 విస్తరణ – central minister nitin gadkari agreed to expand nh 65 at punnami ghat
ఆంధ్రప్రదేశ్

Nh 65 Widening At Punnami Ghat,ట్రాఫిక్ సమస్యలకు చెక్.. పున్నమి ఘాట్ వరకు ఎన్‌హెచ్ 65 విస్తరణ – central minister nitin gadkari agreed to expand nh 65 at punnami ghat

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nh 65 Widening At Punnami Ghat,ట్రాఫిక్ సమస్యలకు చెక్.. పున్నమి ఘాట్ వరకు ఎన్‌హెచ్ 65 విస్తరణ – central minister nitin gadkari agreed to expand nh 65 at punnami ghat
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గొల్లపూడి, దుర్గ గుడి ప్రాంత ప్రజలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్తను అందించారు. ఎన్‌హెచ్ 65 ను ఆరు లేన్లుగా భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు విస్తరించేందుకు కేంద్రమంత్రి నితిన గడ్కరీ ఆమోదం తెలిపారు. దీనివల్ల గొల్లపూడి నుంచి దుర్గగుడి వరకు ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ విస్తరణ వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు, భక్తులకు నగరంలో ప్రయాణించే వారికి ఊరట లభించనుంది. రోడ్డు మధ్యలో సుందరీకరణ పనులు కూడా చేపట్టనున్నారు.

హైలైట్:

  • గొల్లపూడి, దుర్గగుడి ప్రాంత వాసులకు శుభవార్త
  • ఎన్‌హెచ్ 65 ని పున్నమి ఘాట్ వరకు విస్తరణ
  • ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
పున్నమిఘాట్ వరకు ఎన్‌హెచ్ 65 విస్తరణ
పున్నమిఘాట్ వరకు ఎన్‌హెచ్ 65 విస్తరణ (ఫోటోలు– Samayam Telugu)

గొల్లపూడి, దుర్గ గుడి ప్రాంతవాసులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త తెలిపారు. ఈ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌హెచ్ 65ను ఆరు లేన్లుగా… భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు విస్తరించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్ 65 నగరం మధ్య వరకు విస్తరిస్తున్నందున.. రోడ్డు మధ్యలో సుందరీకరణ పనులు చేపట్టాలని.. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని గడ్కరీ.. ఎంపీ చిన్నికి తెలిపారు. గడ్కరీ ఆమోదం వల్ల ఎన్‌హెచ్ 65ను ఆరు లేన్లుగా.. పున్నమి ఘాట్ వరకు విస్తరిస్తే.. ఈ ఆరు వరుసల విస్తరణ మరో నాలుగు కిలోమీటర్ల మేర పెరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ గొల్లపూడి నుంచి దుర్గగుడి వంతెన వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రయాణికులు, వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. సమస్య పరిష్కరించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాజాగా దీనికి ఆమోదం లభించింది.

ప్రస్తుత నిర్ణయంతో ఎన్‌హెచ్ 65 భవానీపురం వరకు ఆరు వరసలుగా వస్తుంది. అక్కడ నుంచి దుర్గగుడి పై వంతెన మొదలవుతుంది. దీనివల్ల హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు, దర్శనానికి వచ్చే భక్తులకు అలానే నగరంలో ప్రయాణించేవారికి ఊరట లభించనుంది. దీన్ని విస్తరించడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది గొల్లపూడిలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వివిధ శాఖల ఆఫీసులు ఉన్నాయి. ఆ కార్యాలయాలకు వెళ్లే వారికి కూడా ప్రయాణం సులభం కానుంది. విస్తరణ వల్ల రోడ్డు మధ్యలో సుందరీకరణ పనులు చేపట్టడం వల్ల కాలుష్యానికి చెక్ పడుతుందని భావిస్తున్నారు.

వాస్తవానికి ఎన్‌హెచ్‌-65 హైదరాబాద్‌ నుంచి మల్కాపురం వరకు.. 40 కి.మీ మేర ఆరు లేన్లుగా విస్తరించి ఉంది. అయితే మల్కాపురం 226 కిమీ మేర గొల్లపూడి పశ్చిమ బైపాస్‌ .. నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లగా విస్తరించాలని కొన్నాళ్ల క్రితం ప్రతిపాదించారు. ఇక ఇదే సమయంలో నేషనల్ హైవే అధికారులు.. గొల్లపూడి వరకు కాకుండా.. ఓఆర్‌ఆర్‌ క్రాస్‌ అయ్యే కంచికచర్ల వరకే విస్తరించాలనే ప్రతి పాదనను తెర మీదకు తెచ్చారు. ఈ అంశాన్ని ఎంపీ చిన్ని.. సీఎం చంద్రబాబు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. చంద్రబాబు సైతం దీని గురించి కేంద్రానికి లేఖ రాశారు.

అయితే శనివారం నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళగిరిలో నిర్వహించిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్‌ ఎన్‌హెచ్ 65 ఆరు వరుసల విస్తరణ విజయవాడ బయటకే పరిమితం చేయకుండా భవానీపురంలోని పున్నమిఘాట్‌ వరకు విస్తరించాలని విన్నవించారు. ఆ ప్రతిపాదనకు గడ్కరీ సరే అన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందంటున్నారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి