అమరావతి, జూన్ 28: రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కమిషన్ నిర్వహించే పలు పరీక్షల విధానంలో కీలక మార్పు తీసుకురానుంది. ఇకపై ఉద్యోగాల భర్తీకి జారీ చేసే నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్టుల సంఖ్యకు 200 రెట్లు దరఖాస్తులు దాటితేనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఫిల్టర్ చేయనున్నారు. అంటే 100 పోస్టుల ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే.. వచ్చే దరఖాస్తులు 200 రెట్లు దాటితే అంటే 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తేనే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం మాత్రం ఉద్యోగాల సంఖ్యతో నిమిత్తం లేకుండా దరఖాస్తులు 25 వేలు దాటితే ఆయా పోస్టులకు సంబంధించిన నియామక పరీక్షలను ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో నిర్వహిస్తున్నారు. దీనివల్ల సమయం వృథా అవుతోందని, ఖర్చు కూడా ఎక్కువగా ఉంటోందని కమిషన్ భావిస్తోంది. అందుకే ఖాళీల సంఖ్య కంటే దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించితేనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఏపీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల్లో చాలా వాటికి కేవలం ఒక్క పరీక్ష మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది.
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ ప్రాథమిక కీ విడుదల.. నేటితో ముగుస్తున్న అభ్యంతరాల తుది గడువు
సీఎస్‌ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్-2025 సెషన్ రాత పరీక్ష జులై 28న రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ తాజాగా ఎన్‌టీఏ విడుదల చేసింది. ఆగస్టు 3 తుది సమయం ముగిసే వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి, ఆ వెనువెంటనే ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశంతోపాటు జేఆర్‌ఎఫ్‌తో, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాలు పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.