డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా కూలీ. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ట్రైలర్లో రజినీకాంత్ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అన్ని అంశాలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అంచనాలను పెంచే ప్లాష్ బ్యాక్ ఉంది. శనివారం సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కూలీ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న రజినీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పది పైసలకు తాను 100 కిలోల బియ్యం సంచిని ఎలా మోసుకెళ్లాడో వివరించారు. ఎంత డబ్బు, పేరు, కీర్తి వచ్చినప్పటికీ ఇంట్లో శాంతి లేకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు.
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
రజనీకాంత్ మాట్లాడుతూ.. ” ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే ఒక వ్యక్తి నన్ను పిలిచి తన లగేజ్ టెంపో వరకూ తీసుకెళ్తావా అని అడిగారు. అతడిని చూస్తే తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నామని అర్థమయ్యింది. లగేజ్ టెంపో వరకు తీసుకెళ్లిన తర్వాత అతడు నా చేతిలో రూ.2 పెట్టి ఒక మాట అన్నాడు. అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు. నీకు ఆ రోజులు గుర్తున్నాయా ? అని అన్నాడు. దీంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. నా జీవితంలో నేను ఎక్కువగా బాధపడిన సందర్భమది” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..
తనను ప్రేక్షకులను అనుక్షణం ఎంతో ప్రేమించారని.. వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పుడు తనను జనాలు ఆదరించారని.. అభిమానుల ప్రేమ ఎప్పటికీ మరువనని అన్నారు. కూలీ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో ఇటీవలే పూజా హెగ్డే నటించిన మోనికా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..