దక్షిణాది సినిమా రంగంలో ఆమె ఒక సంచలనం. అగ్ర హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె సినీ, రాజకీయ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. దివంగత నటి జయలలిత. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మాండ్యలో జన్మించిన ఆమె… చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆమె తల్లి సైతం సినిమాల్లో నటి కావడంతో చిన్న వయసులోనే నటనవైపుకు ఆకర్షితురాలైంది. 1961లో తమిళ చిత్రం ఎపిస్టిల్‌తో అరంగేట్రం చేసింది. 1968లో ధర్మేంద్ర సరసన ఇజ్జత్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రెండు దశాబ్దాలలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. 1970లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. అప్పట్లోనే ఒక్కో సినిమాకు లక్షల్లో పారితోషికం తీసుకునేవారు. 70ల చివరినాటికి అత్యంత ధనిక నటీమణులలో ఒకరిగా మారింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. 80లో సినిమాల నుంచి రిటైర్ అయ్యి ఎంజీ ఆర్ నేతృత్వంలోని ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా.. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆరుసార్లు గెలిచారు. ఆమెను తమిళనాడు ప్రజలంతా అమ్మ అని పిలుచుకునేవారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
1997లో, ఆమె పోయెస్ గార్డెన్ నివాసంలో జరిగిన ఆదాయపు పన్ను దాడిలో 10,500 చీరలు, 750 జతల బూట్లు, 91 గడియారాలు, 1,250 కిలోల వెండి, 28 కిలోల బంగారం, లగ్జరీ కార్లు బయటపడ్డాయి. ఆమె సంపద రూ. 900 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. ఆమె మరణానంతరం ఆమె ఆస్తులను కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయ్యాయి.
ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..