Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు..

3 August 2025

Video: తన సమాధిని తానే తవ్వకుంటున్న ఇజ్రాయెల్‌ బంధీ..! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

3 August 2025

Parenting Tips: మీ పిల్లలు ఏదీ గుర్తుంచుకోవడం లేదా..? ఇలా చేయండి.. మెమోరీ పవర్ డబుల్..

3 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Lv Subrahmanyam Tirumala Darshan Ai Comments,AIతో గంటలో శ్రీవారి దర్శనం అసంభవం.. మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం – former chief secretary lv subrahmanya visits tirumala and said ai can cot speed up tirumala darshan
ఆంధ్రప్రదేశ్

Lv Subrahmanyam Tirumala Darshan Ai Comments,AIతో గంటలో శ్రీవారి దర్శనం అసంభవం.. మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం – former chief secretary lv subrahmanya visits tirumala and said ai can cot speed up tirumala darshan

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Lv Subrahmanyam Tirumala Darshan Ai Comments,AIతో గంటలో శ్రీవారి దర్శనం అసంభవం.. మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం – former chief secretary lv subrahmanya visits tirumala and said ai can cot speed up tirumala darshan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమలలో ఏఐ ఆధారిత దర్శనాలపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వినియోగించి.. సామాన్య భక్తులకు గంటలో శ్రీవారి దర్శనం అసంభవమని ఆయన తేల్చి చెప్పారు. ఏఐ టెక్నాలజీ వాడినా శ్రీవారి శీఘ్ర దర్శనం కష్టమేనని, ప్రస్తుతం వాడుతున్న విధానానికి మించి మార్పులు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.ఏ ఐ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా చేయొద్దని, భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

గంటలో శ్రీవారి దర్శనం అసంభవం
గంటలో శ్రీవారి దర్శనం అసంభవం (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఒక్కోసారి ఎంత రద్దీ ఉంటుందంటే.. దర్శనానికి 24 గంటల కన్నా అధిక సమయం పడుతుంది. ఈక్రమంలో టీటీడీ.. భక్తులకు సౌకర్యాల కల్పన, దర్శనం విషయంలో ఇబ్బంది కలగకుండా చూడటం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే గతంలో టీటీడీ అధికారులు.. భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కలిగేలా చూడటం కోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)ని ఉపయోగించాలని నిర్ణయించింది. దీని కోసం తిరుమలలోని కంపార్ట్‌మెంట్లు, లోపలికి వెళ్లే మార్గం, బయటకు వచ్చే దారుల మధ్య ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావించింది

దీని ద్వారా అన్ని రకాల దర్శనాలు చేసుకునే భక్తుల సంఖ్యను లెక్కిస్తారు. ఈ విధానం వల్ల.. దర్శనానికి కచ్చితంగా ఎంత సమయం పడుతుందో గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. ఈక్రమంలో తిరుమలలో పూర్తి స్థాయిలో ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెండర్లను కూడా పిలిచారు. అయితే ఏఐ వినియోగం కేవలం దర్శనాల కోసం మాత్రమే కాక గదులకు సంబంధించి కూడా ఉపయోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో ఏఐ వినియోగంపై టీటీడీ కసరత్తు చేస్తుండగా.. ఏఐ ఆధారిత దర్శనాల మీద మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటలో శ్రీవారి దర్శనం అసంభవం అన్నారు.

మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం నేడు అనగా ఆదివారం నాడు.. బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీలో తీసుకొస్తున్న మార్పుల గురించి ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలానే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే అంశంలో ఏఐ వినియోగంపైన ఎల్వీ స్పందించారు. సామాన్య భక్తులకు గంట లేదా మూడు గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ వాడినా.. శీఘ్రదర్శనం కష్టమేనని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం వాడుతున్న విధానానికి మించి మరే రకమైన మార్పు చేసే అవకాశం లేదన్నారు. తిరుమలలో ఏఐ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా చేయడం మంచిది కాదని ఎల్వీ ప్రసాద్ సూచించారు.

ఆచరణ అమలు సాధ్యం కాని ఆలోచనలకు స్వస్తి పలకాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం.. టీటీడీకి సూచించారు. దీనికి బదులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై టీటీడీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి