ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మతి చెందారు. ప్రమాదం జరిగిన పని ప్రదేశంలో సుమారు 26మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిందనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..