ఆమెకు 26.. అతనికి 17 ఏళ్లు.. ఆ మహిళలకు అంతకు ముందే పెళ్లి అయ్యింది.. కానీ.. ఆమె మాత్రం.. భర్తను వదిలేసి.. మైనర్‌ను ఇష్టపడింది.. ఆ బాలుడిని ట్రాప్ చేసి.. దగ్గరైంది.. చివరకు అతన్ని పెళ్లాడి.. అందరినీ షాక్ కు గురిచేసింది.. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ పై పోక్సో కేసు నమోదు అయ్యింది.. పెళ్లి అయి.. భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ ఓ మైనర్ బాలుడిను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళింది.. గుడిలో పెళ్ళి చేసుకుని ఆంధ్ర ప్రాంతంలో రహస్య కాపురం కుడా పెట్టింది.. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ మహిళపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.. అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు..
వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన త్రివేణి (26) అనే మహిళకు గతంలో వివాహం అయ్యింది.. భర్తతో గొడవలు, కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని వేరుగా నివసిస్తోంది.. సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది.. ఇదే సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో అతన్ని ఆరు నెలలు క్రితం ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళింది..
ఆరు నెలలు క్రితం ఈ ఘటన జరగడంతో బాలుడు తల్లిదండ్రులు సత్తుపల్లి పీఎస్ లో కిడ్నాప్ కేసు పెట్టారు.. అప్పటి నుంచి విచారణ చేస్తున్న పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ఆ బాలుడిను గుళ్ళో పెళ్లి చేసుకుని. రహస్య కాపురం పెట్టింది.. అయితే, ఫోన్లు వాడకుండా..ఎలాంటి క్లూ దొరకకుండా త్రివేణి జాగ్రత్తలు తీసుకొంది..
ఈ క్రమంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఈ సమయంలో బాలుడు బర్త్ డే సందర్భంగా.. కేక్ తో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.. వారిద్దరూ ఆంధ్రాలో ఉన్నట్లు కనుక్కొని.. కేసును చేధించారు
శనివారం మహిళను, మైనర్ బాలుడిని సత్తుపల్లి తీసుకు వచ్చారు.. బాలుడు మైనర్ కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు వద్దకు పంపారు.. ఆమె పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.. ఓ మహిళపై పోక్సో కేసు నమోదు కావడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..