
మంచి ఆరోగ్యానికి ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యమైనదని అంటున్నారు వైద్య నిపుణలు. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి వాకింగ్ అనేది ఎంతో మేలు చేస్తుంది. వాకింగ్‌తో కేవలం గుండె ఆరోగ్యం మాత్రమే కాదు.. బీపీ, షుగర్, అధిక బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే, ఈ వాకింగ్‌ని కొందరు ఉదయాన్నే చేస్తారు. మరికొందరు సాయంత్రం, రాత్రి వేళ కూడా వాకింగ్‌కి వెళ్తుంటారు. వాకింగ్‌కి ఉత్తమ సమయం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలి, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది అనే సందేహం మాత్రం చాలా మందిలో ఉండే ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం…
మార్నింగ్ వాకింగ్:
బరువు తగ్గించుకోవాలనుకునే వారు, రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకునే వారు మార్నింగ్ వాకింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండె ఆరోగ్యానికి చేసే వ్యాయామాల్లో మార్నింగ్ వాక్ బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ లేకుండానే గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. మార్నింగ్ వాక్‌తో బాడీలో కొవ్వు కరగడమే కాకుండా జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది.
ముఖ్యంగా మార్నింగ్ వాకింగ్‌తో శరీరానికి తగినంత విటమిన్ డీ లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తి, ఎముకల బలోపేతానికి సాయం చేస్తుంది. మార్నింగ్ చేసే వాకింగ్ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, ఎండార్ఫిన్లు లాంటి హ్యాప్పీ హార్మోన్లు విడుదల అవుతాయి.
సాయంత్రం వాకింగ్:
రోజంతా ఏర్పడిన మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, హాయిగా నిద్రపోవాలనుకునే వారికి ఈవినింగ్ వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. సాయంత్రం వరకు కండరాల బలం, పనితీరు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల ఈవినింగ్ వాకింగ్ బాడీ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రయోజనకరం. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడిచితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు, జీవక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడిచితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు, జీవక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..